Heavy Rains in AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం.. రేపటికి తమిళనాడు – శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. దీని ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమపై రెండు రోజులు ఉంటుందని చెబుతున్నారు.. ఇక, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు.. మరోవైపు.. ఎల్లుండి నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేశారు.. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. ఇక, ఈ రోజు కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు వాతావరణశాఖ అధికారులు.. కాగా, ఏపీని వరుస తుఫాన్‌లు భయపెడుతూనే ఉన్నాయి.. తుఫాన్ ఏపీ తీరాన్ని తాకపోయినా.. సమీప రాష్ట్రాల్లో తుఫాన్ తీరం దాటడంతో.. ఆ ప్రభావంపై ప్రతీ సారి ఏపీపై భారీగానే ఉంటున్న విషయం విదితమే..
Read Also: Moto g35 5G: 10 వేల కంటే తక్కువ ధరలో చౌకైన ఫోన్ ను తీసుకొచ్చేస్తున్న మోటోరోలా