Devansh: చదరంగంలో సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ ప్రపంచ రికార్డు
- చెస్‌లో ప్రపంచ రికార్డు సాధించిన నారా దేవాన్ష్
- వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు
- హర్షం వ్యక్తం చేస్తున్న నారా ఫ్యామిలీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devansh: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డును సృష్టించారు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో 9 ఏళ్ల నారా దేవాన్ష్ “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్” ప్రపంచ రికార్డును సాధించాడు. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నాడు. నారా దేవాన్ష్ ఈ ఘనత సాధించడంతో నారా ఫ్యామిలీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా.. నారా దేవాన్ష్ ఇటీవల మరో రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. సెవెన్ డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం ఒక్క నిమిషం 43 సెకన్లలో పూర్తి చేశాడు. అలాగే తొమ్మిది చెస్‌బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగంగా సరైన స్థానాల్లో ఉంచి రికార్డును సాధించాడు.
Read Also: Bandi Sanjay: కిమ్స్ ఆస్పత్రిలో శ్రీ తేజ్‌ను పరామర్శించిన కేంద్రమంత్రి..
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
దేవాన్ష్ ఈ ఘనత సాధించడం పట్ల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌లో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశానన్నారు. దేవాన్ష్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడని.. గ్లోబర్ అరేనాలో ఇండియన్ చెస్ ఛాంపియన్స్ నుంచి ప్రేరణ పొందాడని చెప్పాడు. ఈ ఈవెంట్ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు 5 నుంచి 6 గంటలు శిక్షణ పొందినట్లు నారా లోకేష్ చెప్పారు. చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దేవాన్ష్ ఓ డైనమిక్ విద్యార్థి అని కోచ్ కె.రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు.
చదరంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్‌ను రాష్ట్ర గృహా నిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారధి అభినందించారు. వేగంగా పావులు కదపడం, వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించిన దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేవాన్ష్ మరిన్ని విజయాలు సాధించాలని, ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదిగి మన రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని మంత్రి ఆకాంక్షించారు.
సీఎం చంద్రబాబు ట్వీట్..
Well done, @naradevaansh! Congratulations on setting the World Record for Fastest Checkmate Solver by completing 175 puzzles! Hard work, devotion and perseverance are the key to success. You’ve worked diligently for several months to prepare for this achievement, and I’m proud of… https://t.co/LxdzJ5NtYZ
— N Chandrababu Naidu (@ncbn) December 22, 2024
మంత్రి నారా లోకేష్ ట్వీట్..
.@brahmaninara and I couldn’t be prouder! Wishing you many more achievements, @naradevaansh! Keep shining! https://t.co/UkxQdy5z2c
— Lokesh Nara (@naralokesh) December 22, 2024
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!