India U19 Team History: వరల్డ్‌కప్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. తొలి జట్టుగా రేర్ రికార్డు!
- వరల్డ్‌కప్‌లో భారత్ సరికొత్త చరిత్ర
- ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన భారత్
- ఇప్పటివరకు అత్యధిక స్కోర్ ఆస్ట్రేలియా టీమ్ పేరిట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో భారత జట్టు మరో అరుదైన ఘనత సాధించింది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో 350+ స్కోర్ నమోదు చేసిన తొలి జట్టుగా భారత్ రికార్డుల్లో నిలిచింది. 2026 అండర్-19 ప్రపంచప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ 411/9 పరుగులు చేయడంతో ఈ రికార్డు యువ భారత్ ఖాతాలో చేరింది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన రికార్డు ఇదివరకు భారత్ ఖాతాలోనే ఉండడం విశేషం. 2016 అండర్-19 వరల్డ్‌కప్ క్వార్టర్‌ఫైనల్‌లో నమీబియాపై భారత్ 349/6 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 96 బంతుల్లో 111 పరుగులు చేశాడు.
ఫైనల్ మ్యాచ్‌ల విషయానికి వస్తే.. ఇప్పటివరకు అత్యధిక స్కోర్ ఆస్ట్రేలియా టీమ్ పేరిట ఉంది. 2024 అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 253/7 పరుగులు చేసింది. తాజాగా భారత్ ఆసీస్ రికార్డును బద్దలు కొట్టింది. 2026 ప్రపంచప్ ఫైనల్‌లో 411 పరుగులతో ఫైనల్ స్కోర్ల పరంగానూ ఈ టోర్నీలో కొత్త బెంచ్‌మార్క్ ఏర్పడింది. ఇది భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్‌లలో మూడో 400+ స్కోర్ కావడం విశేషం. ప్రపంచంలోని మరే జట్టుకైనా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఒకటి కంటే ఎక్కువ 400+ స్కోర్లు లేవు. ఈ విషయంలో భారత్ స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుతోంది.
Also Read
- ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
Also Read: 2026 U19 WC Final: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ ముందు ఊహించని టార్గెట్!
ఇక ఛేజింగ్ రికార్డుల విషయానికి వస్తే.. అండర్-19 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు అత్యధిక విజయవంతమైన ఛేజ్ కూడా భారత్‌దే. ఇటీవల సెమీఫైనల్‌లో అఫ్గానిస్తాన్‌పై భారత్ 311 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి.. సరికొత్త చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్‌లో యువ ఆటగాళ్ల ధైర్యం, లోతైన లైనప్ ఈ రికార్డులకు కారణంగా నిలిచాయి. మొత్తంగా చూస్తే.. అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్ యువ క్రికెటర్లు బ్యాటింగ్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ.. ప్రపంచ క్రికెట్ దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నారు. టీమిండియాకు ఈ యువ ప్లేయర్స్ భవిష్యత్ తారలుగా ఉంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?