Nara Bhuvaneshwari : చంద్రబాబు దూరదృష్టితో ఆలోచిస్తారని, చంద్రబాబు విజనరీ రాష్ట్రానికి ఎంతో అవసమన్నారు నారా భువనేశ్వరి. నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి వద్ద మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. మహిళల ఎదుగుదల రాష్ట్రానికి, దేశానికీ ఎంతో అవసరమన్నారు. మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే అన్నివిధాలా సమాజం అభివృద్ధి చెందుతుందని గట్టిగ నమ్మే వ్యక్తి చంద్రబాబు అని ఆయన అన్నారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి నోటీసులు.. ఆ రోజు కోర్టుకు రావాలని వెల్లడి
గతంలో డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తాం అని ప్రకటించినపుడు చాలా మంది ఎగతాళి చేసారని, మహిళలకు ఇవన్నీ అవసరమా అని ప్రశ్నించ్చారన్నారు. ఇప్పుడు అదే మహిళా సంఘాలు దేశంలోనే ఎక్కడ లేనివిధంగా వృద్ధి సాధిస్తున్నాయన్నారు. కుప్పం ప్రజలకోసం చేసిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని, రైతులకోసం దేశంలోనే మొట్టమొదటి సరిగా కుప్పంలో ఇజ్రాయిల్ తరహా వ్యవసయాన్ని పరిచయం చెయ్యడమే కాకుండా వ్యవసయంలో పెద్ద విప్లవమే తెచ్చారన్నారు నారా భువనేశ్వరి. గత పాలకులు రాష్ట్రాన్ని వందేళ్ల వెనక్కి తీసుకెళ్లారని మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి లోకి తెచ్చేందుకు చంద్రబాబు చాలా శ్రమిస్తున్నారన్నారు.