న్యూ ఇయర్ వేడుకలకు సాగర నగరం వైజాగ్ ముస్తాబవుతుండగా.. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి గైడ్లైన్స్ విడుదల చేశారు పోలీస్ కమిషనర్.. ఇవెంట్స్ నిర్వహించాలనుకునే వారి నుండి దరఖాస్తులకు ఆహ్వానించారు.. అయితే, అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ కమిషనర్..
2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. పది రోజులపాటు టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించునుంది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనంపై అధికారులతో సమీక్షించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి..
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పునఃనిర్మాణ పనులు స్పీడందుకున్నాయి.. రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బాంక్ నుంచి నిధులు విడుదల అయ్యాయి.. దీంతో, పనుల్లో వేగం పెరిగింది..
విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ సిద్ధమైంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు తిరగకుండానే ప్రజలపై 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని ఆరోపిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దీనికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వైసీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిరసన…
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో ఉన్నారు. ఈ సందర్భంగా నేడు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాలు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆర్కే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓవైపు తప్పులు చేసి మనం ఓడిపోలేదు అని పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూనే.. మరోవైపు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రోజా.. జైల్లో పెడతావా..? పెట్టుకో.. కేసులు పెడతావా? పెట్టుకో.. ఉద్యోగాలు తీసేస్తావా తీసేసెయ్..! మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది.. వడ్డీతో సహా తిరిగి ఇస్తామని హెచ్చరించారు.. ఇక, కూటమి ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తల పేర్లను గుడ్…
జూదం, గుండాట, పేకాట మాకొద్దు అంటూ జనసేన వినూత్న నిరసన చేపట్టింది.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం పంచాయతీ పరిధిలో బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అంపాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయకంగా జరగవలసిన ఆటల పోటీలను కలుషితం చేస్తున్నారని.. సంక్రాంతి పండగను అడ్డం పెట్టుకుని గుండాట, పేకాట, కోళ్లకు కత్తులు కట్టి హింసాత్మక వాతావరణం…