CM Chandrababu Serious: ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, మంత్రి వర్గ సమావేశంలో రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతోన్న విషయం విదితమే కాగా.. ఈ సదస్సులో భూ సమస్యలు లక్షలాదిగా వెలుగు చూస్తున్నాయి.. అయితే, రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ వచ్చిందట.. కానీ, ఆ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి, ఎందుకు కావడం లేదు అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు.. దీంతో, త్వరలోనే పరిష్కారం అవుతాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.. కానీ, మనకు ఓపిక ఉంది.. ప్రజలకు ఓపిక ఉండాలి కదా? ప్రజలు ఎన్ని రోజులు ఎదురు చూస్తారు అని సీఎం నిలదీసినట్టుగా చెబుతున్నారు.. 22A భూములు, ఇళ్ల స్థలాలు వెంటనే ఎందుకు పరిస్కరించలేదు అని సీఎం ప్రశ్నించగా.. మొత్తం సమస్యలు పరిష్కారం చేసి ఒక రిపోర్ట్ ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారట..
Read Also: CMR College: సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వార్డెన్ సస్పెండ్..
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ సమస్యల పరిష్కారంపై దృష్టిసారించింది.. దాని కోసం ప్రత్యేకంగా రెవన్యూ సదస్సులు నిర్వహిస్తోంది.. గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి.. డిసెంబర్ 6వ తేదీన ప్రారంభమైన ఈ రెవెన్యూ సదస్సులు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి.. అయితే, ఈ సదస్సుల్లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి.. సదస్సుల నిర్వహణపై మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ పాపాల కారణంగా రాష్ర్టంలో విపరీతంగా భూ సంబంధ సమస్యలు పెరిగిపోయాయి.. రెవెన్యూ సదస్సులకు వస్తున్న అర్జీలే ఇందుకు తార్కాణంగా పేర్కొన్నారు.. ఇప్పటి వరకు లక్షా 80 వేల అర్జీలు వచ్చాయన్న ఆయన.. వాటిలో 13 వేల ఫిర్యాదులకు అక్కడిక్కడే పరిష్కారం లభించిందన్నారు.. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో రెవెన్యూ సదస్సులకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.. ఇప్పటి వరకు 6 లక్షల మంది రెవెన్యూ సదస్సులకు హాజరై తమ సమస్యలను చెప్పుకున్నారు.. ఆర్ ఓ ఆర్ లో తప్పులపై లక్షకుపైగా ఫిర్యాదులు రాగా.. భూమి సరిహద్దు సమస్యలపై 18 వేలకు పైగా అర్జీలు వచ్చాయి.. రీసర్వే సమస్యలపై 11 వేలకు పైగా ఫిర్యాదులు అందాయి.. అసైన్డ్ ఇళ్ల స్థలాలపై ఆరు వేలకు పైగా ఫిర్యాదులు ఇచ్చారు.. 22 ఏ భూముల అక్రమాలపై 4,500 ఫిర్యాదులు వచ్చినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి అనగాని సత్యప్రసాద్..