వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా బంగాళాఖాతంలో అల్ప పీడనం కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే క్రమంలో బల హీనపడుతుందని అంచనాలు వున్నాయి.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే కీలక నిర్మాణాలకు అనుమతులు కూడా జారీ చేసింది.. ఇదే సమయంలో అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఫోకస్ పెంచింది. భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తదుపరి చర్యలకు అధికారులు సిద్ధం అవుతున్నారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని వాతావరణశాఖ చెబుతోంది. ఉత్తర భారతం మీదుగా వెళుతున్న పశ్చిమ ద్రోణి అల్పపీడనాన్ని, తేమను తనవైపు లాగడానికి ప్రయత్నిస్తోంది. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలకు అవకాశం ఉంది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాజీ ప్రధాని వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. కాసేపట్లో వాజపేయి సమాధి సదైవ్ అటల్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ కూటమి పక్షాల నేతల సమావేశానికి హాజరుకానున్నారు చంద్రబాబు..
తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ పెట్టడం ఆందోళనకు దారి తీసింది. ఆధ్యాత్మిక నగరంలో అపచారం జరిగిందని హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. ఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశాయి.
కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి స్టైల్...కూటమిలో చర్చనీయాంశంగా మారింది. నిజం చెప్పాలంటే ఆదోని ప్రాంతంలో బీజేపీకి బలం లేదు. కూటమి పొత్తులో భాగంగా ఆదోని టికెట్ బీజేపీకి వెళ్లింది. దీంతో ఆ పార్టీ టికెట్ దక్కించుకుని పార్థసారథి గెలుపొందారు. గతంలోనూ టీడీపీ పొత్తులో ఆదోని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీస్తోందట.
వైసీపీ ఆవిర్భావం నుంచి సవాళ్లతోనే పార్టీని నడుపుతున్నారు అధినేత జగన్మోహన్రెడ్డి. 2014లోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించినప్పటికీ...67 అసెంబ్లీ స్థానాలతోనే సరిపెట్టుకుంది. ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు, నేతలను జగన్...సమన్వయం చేయటంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బౌన్స్ బ్యాక్ అయ్యారు. పట్టుదలగా పని చేసిన జగన్ పార్టీకి...175 స్థానాలకు 151 సీట్లు కట్టబెట్టారు. 50 శాతం పైగా ఓట్లు సాధించి...అధికారంలోకి వచ్చారు. కేడర్ కూడా పార్టీ అధికారంలోకి రావాలన్న కసితో పనిచేయడంతో వైసీపీకి…
డెడ్ బాడీ హోమ్ డెలివరీ చేసిన కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీసులు. దీంతో సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ వీడనుంది. మృతదేహాన్ని పార్సల్ చేసి పోలీసులను ముప్పు తిప్పులు పెట్టిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.