నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడపకు చేరుకొని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవోను పరామర్శించనున్నారు. అనంతరం గాలివీడుకు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు. గాలివీడులో ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన పరిశీలించనున్నారు.
* నేటి ఉదయం 11.45 గంటలకు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు.. ఉదయం 8గంటలకు మన్మోహన్ నివాసం నుంచి ఏఐసీసీ కార్యాలయానికి పార్థివదేహం తరలింపు.. ఉదయం. 8.30 నుంచి 9.30 వరకు ఏఐసీసీ కార్యాలయంలోనే పార్థివదేహం.. నివాళులర్పించనున్న కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు.. ఉదయం. 9.30 గంటలకు ప్రారంభంకానున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర.. * నేడు కడప జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించనున్న పవన్.. వైసీపీ…
ఆర్కే రోజా... ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్. ఎనీ సబ్జెక్ట్, ఎనీ సెంటర్... తెలిసినా, తెలియకున్నా సరే.. వాగ్ధాటితో అవతలోళ్ళ నోరు మూయించడంలో దిట్ట. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి...మంత్రిగా పనిచేసిన రోజా.... గత ఎన్నికలలో దారుణమైన ఓటమి తర్వాత దాదాపుగా పొలిటికల్ అజ్ఞాతంలో ఉన్నారు. పాలిటిక్స్‌లో నోరే నా ఆయుధం అనుకున్న మాజీ మంత్రికి గత ఎన్నికల్లో అదే రివర్స్ అయిందన్న అభిప్రాయం ఉంది.
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి ఘటన కలకలం రేపుతోంది.. అయితే, ఈ ఘటనపై కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్…
బొత్స సత్యనారాయణ.... లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ప్రస్తుతం ఇదే పొలిటికల్ హాట్. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఓ వెలుగు వెలిగిన నేత. రాజకీయ విమర్శలను సైతం తూకం వేసినట్టు చేసే బొత్సకు 2024 ఎన్నికలు చేదు అనుభవం మిగిల్చాయి. కంచుకోట లాంటి చీపురుపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కళా వెంకట్రావ్ చేతుల్లో ఓడిపోయారాయన.
2024కి బైబై చెప్పేసి.. 2025కి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధం అవుతోంది.. ఇక, కొత్త సంవత్సర వేడుకలకు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం కూడా రెడీ అవుతోంది.. ధూంధామ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.. మెలోడీ బ్రహ్మ మణిశర్మతో పాటు ప్రఖ్యాత సింగర్లు, నటి నటులతో ఈవెంట్స్ అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నారు.. అమరావతిలో భారీ సెట్లలో నాలుగు గ్రాండ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి.. విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో అప్పుడే ఈ ఈవెంట్స్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది..
ఈఎంఐ డబ్బులు చెల్లించకపోవడంతో న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలైన సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు..
ఆంధ్రప్రదేశ్‌లో భూముల మార్కెట్ ధరలు పెరుగుతున్నాయని బాగా ప్రచారం జరుగుతోంది.. మార్కెట్ రేట్ పెరిగితే ఆటోమాటిక్ గా రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరుగుతాయి.. దీంతో కొంతమంది ప్రజలు కూడా ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో తొందర పడుతున్నారు. అయితే, ఈ నెల 30వ తేదీన సీసీఎల్ఏలో కీలక సమావేశం జరగనుంది. జోనల్ రెవెన్యూ సమావేశంలో కొన్ని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. భూముల మార్కెట్ ధరలపై చర్చిస్తారు. అయితే, ఇప్పటికే జాయింట్…