కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేక భేటీ.. ఏం చేద్దాం..?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.. పలు కీలక అంశాలపై చర్చించారు.. కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేబినెట్.. అయితే, సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. పాలనా అంశాలు కొద్దిసేపు ముచ్చటించారు.. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపైన చర్చించారు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసే అంశంపై చర్చించారు.. రైతులకు కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి ఆర్థిక సాయాన్ని రూ 20,000ను ఒకేసారి చెల్లించే అంశంపై కూడా మంత్రులతో మంతనాలు జరిపారు.. ఇక, రాష్ట్రంలోని మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయంపైన చర్చించిన సీఎం.. వేట నిలిచిపోయిన సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం రూ.20వేలను వారికి చెల్లించే అంశంపై మంత్రులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత మంత్రులపై ఉందని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేయాలనే నిర్ణయానికి వచ్చారు.. కాగా, ఈ నెల ఎనిమిదో తేదీన విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు.. ప్రధాని రోడ్ షో కూడా నిర్వహించే నేపథ్యంలో దాన్ని విజయవంతం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
రెవెన్యూ సదస్సుకు అపూర్వ స్పందన.. ఇప్పటి వరకు 1.80 లక్షల అర్జీలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ సమస్యల పరిష్కారంపై దృష్టిసారించింది.. దాని కోసం ప్రత్యేకంగా రెవన్యూ సదస్సులు నిర్వహిస్తోంది.. గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి.. డిసెంబర్ 6వ తేదీన ప్రారంభమైన ఈ రెవెన్యూ సదస్సులు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి.. అయితే, ఈ సదస్సుల్లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి.. సదస్సుల నిర్వహణపై మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ పాపాల కారణంగా రాష్ర్టంలో విపరీతంగా భూ సంబంధ సమస్యలు పెరిగిపోయాయి.. రెవెన్యూ సదస్సులకు వస్తున్న అర్జీలే ఇందుకు తార్కాణంగా పేర్కొన్నారు.. ఇప్పటి వరకు లక్షా 80 వేల అర్జీలు వచ్చాయన్న ఆయన.. వాటిలో 13 వేల ఫిర్యాదులకు అక్కడిక్కడే పరిష్కారం లభించిందన్నారు.. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో రెవెన్యూ సదస్సులకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.. ఇప్పటి వరకు 6 లక్షల మంది రెవెన్యూ సదస్సులకు హాజరై తమ సమస్యలను చెప్పుకున్నారు.. ఆర్ ఓ ఆర్ లో తప్పులపై లక్షకుపైగా ఫిర్యాదులు రాగా.. భూమి సరిహద్దు సమస్యలపై 18 వేలకు పైగా అర్జీలు వచ్చాయి.. రీసర్వే సమస్యలపై 11 వేలకు పైగా ఫిర్యాదులు అందాయి.. అసైన్డ్ ఇళ్ల స్థలాలపై ఆరు వేలకు పైగా ఫిర్యాదులు ఇచ్చారు.. 22 ఏ భూముల అక్రమాలపై 4,500 ఫిర్యాదులు వచ్చినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి అనగాని సత్యప్రసాద్..
కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్‌ల్లో అపశృతి.. రన్నింగ్ రేస్‌లో ప్రాణాలు విడిచిన యువకుడు..
కృష్ణాజిల్లాలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల దేహ దారుఢ్య పరీక్షలో అపశృతి చోటుచేసుకుంది. 1600 మీటర్ల పరుగు పందెంలో పడిపోయిన యువకుడు… చికిత్స అందిస్తుండగా మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందాడు.. మృతి చెందిన అభ్యర్థి కృష్ణాజిల్లా ఏ కొండూరు గ్రామానికి చెందిన ఎన్ చంద్రశేఖర్ (25)గా గుర్తించారు.. కాగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డ్ గత కొన్ని రోజులుగా ఉద్యోగ నియమగా ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణత పొందిన వారికి శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తోంది.. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన అభ్యర్థులకు లక్ష్మీ టాకీస్ సెంటర్‌లోని పోలీస్ కార్యాలయాన్ని పోలీస్ పెరల్స్ గ్రౌండ్స్ నందు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.. గురువారం ఓ అభ్యర్థి ఈ ఈవెంట్స్ చేస్తూ ఉండగా పడిపోయాడు.. వెంటనే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఉద్యోగం సాధించి కుటుంబ సభ్యులను పోషిస్తాడని ఆశతో ఎదురుచూసిన తల్లిదండ్రులు ఈ చేదు వార్త కన్నీటిని మిగిల్చింది.
రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం..
రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాపై ఈరోజు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు. రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయనున్నారు. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో భేటీ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.
క్లాస్ మెట్కు న్యూ ఇయర్ విషెస్.. సాయంత్రం అబ్బాయి సూసైడ్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త సంవత్సరం వేళ విషాదం చోటు చేసుకుంది. క్లాస్ మెట్కు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన బాలుడు.. సాయంత్రం సూసైడ్ చేసుకున్న వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన జరిగింది. భీముని మల్లా రెడ్డి గ్రామానికి చెందిన శివ కిషోర్ (17) అనే 10వ తరగతి విద్యార్థి.. అదే గ్రామానికి చెందిన అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు. ఈ క్రమంలో శివ కిషోర్ పై విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు దాడికి పాల్పడ్డారు. దీంతో.. మనస్థాపానికి గురైన శివ కిషోర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శివ కిషోర్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. అంతకుముందు.. మృతుడి తల్లికి కూడా వార్నింగ్ ఇచ్చారు అమ్మాయి కుటుంబ సభ్యులు. కాగా.. శివ కిషోర్ ఆత్మహత్యకు కారణమైన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువుల పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. శివ కిషోర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల పట్టుకునేందుకు జిల్లా బాస్ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
లైంగిక వేధింపుల కేసుని రాజకీయం చేస్తున్నారు.. హైకోర్ట్ ఫైర్..
చెన్నై అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల ఘటన తమిళనాడులో రాజకీయ దుమారానికి కారణమైంది. 19 ఏళ్ల యువతిపై వర్సిటీ క్యాంపస్‌లోనే లైంగిక దాడి జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తికి అధికార డీఎంకే పార్టీలో సంబంధాలు ఉండటం సంచలనంగా మారింది. అధికార ఎంకే స్టాలిన్ ప్రభుత్వంపై బీజేపీతో పాటు అన్నాడీఎంకే పార్టీలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ కేసుని మద్రాస్ హైకోర్టు సమోటోగా స్వీకరించింది. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల ఘటనను రాజకీయం చేస్తు్న్నారంటూ గురువారం హైకోర్టు మండిపడింది. “అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసును రాజకీయం చేస్తున్నారు. మహిళల భద్రతపై అసలు ఏకాగ్రత లేదు” అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై చెన్నైలో నిరసనకు పోలీసుల అనుమతి నిరాకరించడంపై పట్టాలి మక్కల్ కట్చి (పిఎంకె) కోర్టుని ఆశ్రయించిన సందర్భంలో హైకోర్టు ఈ కామెంట్స్ చేసింది. ఈ కేసుని విచారించేందుకు జాతీయ మహిళా కమిషన్ (NCW) రిటైర్డ్ IPS అధికారి ప్రవీణ్ దీక్షిత్‌తో సహా ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రోజుల విచారణలో యూనివర్సిటీని సందర్శించిన కమిటీ, బాధితురాలు, ఆమె కుటుంబం, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశమై క్యాంపస్ భద్రతను అంచనా వేసింది.
నాసిక్‌లో దారుణం.. వ్యక్తిని చంపి తలతో పోలీసుల ఎదుట లొంగిపోయిన తండ్రి, కొడుకు
మహారాష్ట్రలోని నాసిక్‌లో దారుణం జరిగింది. ఇరు కుటుంబాల తగాదాలతో ఓ వ్యక్తిని హత్య చేశారు. అనంతరం మొండెం నుంచి తలను వేరుచేసి ఇద్దరు నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఉద్రిక్తతలు ఏర్పడడంతో పోలీసులు మోహరించారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా దిండోరి తాలూకాలోని నానాషి గ్రామంలో సురేష్ బోకె(40), పొరుగువాడైన గులాబ్ రామచంద్ర వాగ్మారే(35) మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. ఇక డిసెంబర్ 31, 2024న ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటనతో సురేష్ బోకె కుటుంబం పగతో రగిలిపోయింది. అంతే న్యూఇయర్ వేళ.. బుధవారం ఉదయం సురేష్ బోకె, అతని కుమారుడు… గులాబ్ రామచంద్ర వాగ్మారేను గొడ్డలితో నరకగా ఘటనాస్థలిలోనే ప్రాణాలు పోయాయి. అంతటితో ఆగకుండా కత్తితో పీక కత్తిరించి తలను తీసుకుని గురువారం తండ్రి, కొడుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహంతో నిందితుల ఇల్లును, కారును ధ్వంసం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్‌ల సిబ్బందితో పాటు స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్‌ఆర్‌పీఎఫ్) సిబ్బంది గ్రామంలో మోహరించారు. నిందితులు ఆయుధాలు, తలను తీసుకుని నానాషి అవుట్‌పోస్ట్ పోలీసు చౌకీకి చేరుకున్నారని ఒక అధికారి తెలిపారు.
అర్ధరాత్రి నుంచే కియా సిరోస్ ఎస్‌యూవీ బుకింగ్స్.. ధర, ఫీచర్స్ ఇవే..
దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు కియా ద్వారా అనేక అద్భుతమైన వాహనాలు భారత మార్కెట్లో విక్రయించబడుతున్న సంగతి తెలిసిందే.. కాగా.. ఇటీవల ఇండియాలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూనే కంపెనీ మరో కొత్త వాహనాన్ని విడుదల చేసింది. అదే కియా సిరోస్ ఎస్‌యూవీ.. కియా మోటార్స్ జనవరి 3 నుంచి తన పోర్ట్‌ఫోలియోలో సరికొత్త సిరోస్ ఎస్‌యూవీ బుకింగ్‌ను ప్రారంభించనుంది. అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి దీని బుకింగ్ ప్రారంభం కానుంది. కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా కంపెనీ డీలర్‌షిప్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీ కూడా ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోలిస్తే దీని డిజైన్ పూర్తిగా భిన్నంగా ఉంది. భారతీయ మార్కెట్లో కంపెనీకి ఇది 7వ మోడల్. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే సోనెట్, సెల్టోస్, నిస్సాన్, కార్నివాల్, ఈవీ6, ఈవీ9 ఉన్నాయి. దాని బేస్ టర్బో ట్రిమ్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.50 లక్షలు ఉండొచ్చు. టాప్ వేరియంట్ ధర రూ. 15 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
ఏంటి గురూ ఇలా కొనేశారు.. డిసెంబర్‌లో రికార్డు సృష్టించిన స్విఫ్ట్
మారుతీ సుజుకి ఇండియా దేశంలోనే ప్రతి సంవత్సరం కొత్త మైలురాళ్లను నెలకొల్పుతున్న ఏకైక కంపెనీ. డిసెంబర్ 2024లో కూడా కంపెనీ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. గత నెలలో కంపెనీ 2,52,693 యూనిట్ల అధిక రిటైల్ విక్రయాలను నమోదు చేసింది. చరిత్రలో తొలిసారిగా 2.50 లక్షల యూనిట్ల నెలవారీ విక్రయాల్లో ఇది కొత్త మైలురాయి. ఈ సేల్‌లో దాదాపు 30 వేల యూనిట్ల స్విఫ్ట్ ఉన్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. గత నెలలో 29,765 యూనిట్ల మారుతి సుజుకి స్విఫ్ట్ లను విక్రయించారు. దేశంలో ఒక్కనెలలో అత్యధికంగా అమ్ముడైన కారుగా స్విఫ్ట్ కూడా నిలిచింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని ఇతర కార్లైన మారుతి వ్యాగన్ఆర్ 29,566 యూనిట్లు, మారుతి బాలెనో 26,789 యూనిట్లను జనాలు కొనుగోలు చేశారు. ఈ విధంగా టాప్-3 స్థానాలను కూడా ఈ కార్లు కైవసం చేసుకున్నాయి. కంపెనీ తాజాగా స్విఫ్ట్ కొత్త వేరియంట్‌ను మే 2024లో భారతదేశంలో విడుదల చేసింది. ప్రస్తుతం ఇది దేశంలోనే నంబర్-1 హ్యాచ్‌బ్యాక్‌గా కొనసాగుతోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.59 లక్షల వరకు ఉన్నాయి. కాగా.. సేఫ్టీ రేటింగ్ విషయంలో మారుతీ సుజుకీపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. డిజైర్ ఫైవ్ స్టార్ రేటింగ్ అందుకోవడం గమనార్హం. స్వచ్ఛందంగా మారుతీ ఈ వెహికల్‌ను క్రాష్ టెస్ట్‌కు పంపింది. పెద్దల భద్రతకు సంబంధించి 34 పాయింట్లకు గాను 31.24 పాయింట్లను కొత్త డిజైర్ సాధించింది. చిన్నారుల భద్రతకు సంబంధించి 42 పాయింట్లకు గాను 39 పాయింట్లు పొందింది.
ఆసక్తికరంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడ మూవీ ‘పినాక’ టీజర్
కన్నడ గోల్డెన్ స్టార్ గణేష్ అప్ కమింగ్ మూవీ ‘పినాక’ టీజర్ విడుదలైయింది. టీజర్ అభిమానులను, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విజువల్ ట్రీట్‌ను అందించింది. గోల్డెన్ స్టార్ గణేష్ క్షుద్ర, రుద్రగా స్టన్నింగ్ న్యూ అవాతర్ లో తన వెర్సటాలిటీ చూపించారు. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బి. ధనంజయ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మైల్ స్టోన్ 49వ ప్రాజెక్ట్ (PMF49)గా వస్తున్న ‘పినాక’ కన్నడ సినిమాలో ఒక మార్క్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఒక గ్రిప్పింగ్ స్టోరీలైన్, అద్భుతమైన విజువల్స్, బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్స్ తో కూడిన గ్రాండ్ పీరియాడిక్ డ్రామాని టీజర్ పరిచయం చేసింది. బ్రెత్ టేకింగ్ వీఎఫ్ఎక్స్, అడ్వాన్స్ విజువల్స్‌తో ‘పినాక’ న్యూ ఎక్సయిటింగ్ వరల్డ్ ని ప్రజెంట్ చేసింది. రాంపేజ్ ఆఫ్ క్షుద్ర పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, హై క్యాలిటీ స్టొరీ టెల్లింగ్, వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ ద్వారా కన్నడ సినిమాను నెక్స్ట్ లెవల్ కి చేర్చాలనే విజన్ కి ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా ఉండబోతోంది. ఈమూవీ గోల్డెన్ స్టార్ గణేష్ కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తోంది, ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలో అతని వెర్సటాలిటీని ప్రజెంట్ చేస్తోంది. మరిచిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తూ టీజర్ గ్రేట్ ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేసింది. ఈ ప్రాజెక్ట్స్ కి సంబధించిన మరిన్ని అప్‌డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
మళ్ళీ తల్లవనున్న ఇలియానా?
పెళ్లికి ముందే బిడ్డను కన్న తర్వాత మళ్లీ గర్భవతి అని హింట్ ఇచ్చింది ఇలియానా. ఇలియానా తెలుగులో దేవదాసు సినిమాతో హీరోయిన్ గా మారి ఆ తరువాత తమిళ సినిమా ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ టచ్ చేసినవన్నీ హిట్ అయ్యాయి. ఆ తరువాత తెలుగులో కూడా ఒక ఊపు ఊపింది. దీంతో తక్కువ కాలంలోనే ప్రభాస్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించి అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది ఇలియానా. తదనంతరం, తమిళ చిత్ర పరిశ్రమలోకి నన్బన్ చిత్రంతో రీ-ఎంట్రీ ఇచ్చి. న్బనన్ సినిమాలో విజయ్ సరసన నటించిన ఇలియానా ఆ సినిమా విజయంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తరువాత, అతను తమిళ చిత్ర పరిశ్రమలో కనిపించలేదు. 2018 లో ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్‌తో సహజీవనం చేసింది. అయితే అది బ్రేకప్ అయింది. ఓ దశలో ఇలియానా తను మోసపోయిందని భావిస్తూ మద్యానికి బానిసైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఒకానొక సమయంలో సినిమాలు కూడా మానేసిన ఇలియానా 2023లో ప్రెగ్నెంట్ అని చెప్పి షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే ఆమె ఎలా గర్భం దాల్చింది అనేది చాలా మంది ప్రశ్న అనుకోండి.అయితే ఆ ఏడాది ఆగస్టులో ఇలియానా అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ తర్వాత ఇలియానా తన భర్తను పరిచయం చేసింది. మైఖేల్ డోలన్ గత సంవత్సరం తన భర్త అని ప్రకటించింది. అయితే ఇప్పుడు కొత్త సంవత్సరం రోజున ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 2024 యొక్క ముఖ్యమైన సంఘటనల సందర్భంగా తీసిన ఫోటోల సంకలనంతో ఒక ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అందులో తాను అక్టోబర్‌లో గర్భం దాల్చినట్లు హింట్ ఇచ్చింది. అందులో తన చేతిలో ప్రెగ్నెన్సీ కిట్ ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమె మళ్లీ గర్భవతి అని తెలుసుకుని అభినందనలు తెలుపుతున్నారు.