CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.. పలు కీలక అంశాలపై చర్చించారు.. కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేబినెట్.. అయితే, సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. పాలనా అంశాలు కొద్దిసేపు ముచ్చటించారు.. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపైన చర్చించారు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసే అంశంపై చర్చించారు.. రైతులకు కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి ఆర్థిక సాయాన్ని రూ 20,000ను ఒకేసారి చెల్లించే అంశంపై కూడా మంత్రులతో మంతనాలు జరిపారు..
Read Also: Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఈవీ టీజర్ విడుదల.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 473కి.మీ రేంజ్..
ఇక, రాష్ట్రంలోని మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయంపైన చర్చించిన సీఎం.. వేట నిలిచిపోయిన సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం రూ.20వేలను వారికి చెల్లించే అంశంపై మంత్రులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత మంత్రులపై ఉందని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేయాలనే నిర్ణయానికి వచ్చారు.. కాగా, ఈ నెల ఎనిమిదో తేదీన విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు.. ప్రధాని రోడ్ షో కూడా నిర్వహించే నేపథ్యంలో దాన్ని విజయవంతం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..