Deputy CM Pawan Kalyan: విజయవాడలో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్‌ను ప్రారంభించారాయన.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకూ బుక్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పుస్తకాలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలు.. కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా వెనుకాడను.. కానీ, పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తాను అంటూ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు..
Read Also: Indian Snakeroot: ఈ ఒక్క మొక్క పెంచండి.. మీ ఇంటి పరిసరాల్లో పాములు అస్సలు రావు..
జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకం.. పుస్తకాలను నా సంపదగా భావిస్తాను అన్నారు పవన్ కల్యాణ్.. నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వడానికి ఆలోచిస్తానన్న ఆయన.. నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయే వాడినో అని పేర్కొన్నారు.. నాకు ఏమి కావాలో అది నేర్చుకోవడానికి పుస్తకాలు ఉపయోగపడ్డాయి.. రెండు చోట్లా ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నిలబడేలా చేశాయన్నారు.. చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా.. పుస్తకాలు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు.. ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం అన్నారు.. తెలుగు సరిగ్గా నేర్చుకొనందుకు ఈరోజు నేను బాధపడుతున్నా.. స్కూల్ లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు.. ఇంగ్లీష్ ఒక్కటే పేదరికాన్ని దూరం చేస్తుంది అనడం సరికాదన్నారు.. ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృ బాధ చాలా ముఖ్యం అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Car Price: పెరిగిన కార్ల ధరలు.. ఏయే కంపెనీలు ఎంతేంత పెంచాయో చూద్దామా?
నేను మీకు ప్రాణం అయితే, నాకు పుస్తకాలు అంటే ప్రాణం అన్నారు పవన్.. అంటే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన కారణాల్లో ఒకటి పుస్తకాలు. అందుకే మిమ్మల్ని పుస్తకాలు చదవమనేది.. పుస్తకం నచ్చిందా లేదా అని కాదు. అసలు ఒక పుస్తకంలో ఒక పేజీ రాయడం ఎంత కష్టమో అర్థం చేసుకుంటే రచయితలపై గౌరవం కలుగుతుందన్నారు.. పాపులారిటీ ఉన్న ప్రతి వారు గొప్ప వారు కాదు నాతో సహా.. జ్ఞానం ఉన్నవారు, రచయితలు గొప్పవారని పేర్కొన్నారు.. మనం తెలుగు వారీగా పుట్టడం మన అదృష్టం. తెలుగు ఎంత గొప్ప భాష అంటే ఎవరికైనా తేలిగ్గా జ్ఞానోదయం చేసే గొప్ప సాహిత్యం ఉంది అన్నారు.. ఇంటర్ తో చదువు ఆపేసాను కానీ చదవడం ఆపలేదు. చదవడం వల్ల మానసిక శక్తి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్..