Andhra Pradesh: ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు.. జీవో జారీ
- ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ విడుదల..
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- దీనిపై ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ ఉత్తర్వులు జారీ..
- ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్న ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ ఉత్తర్వులు జారీ చేసింది సాధారణ పరిపాలన శాఖ.. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొంది ప్రభుత్వం.. 90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకం అని అభిప్రాయపడింది.. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషా సమగ్రతకు ఇలా ఉత్తర్వులు జారీ చేయడం తోడ్పడుతుందని పేర్కొంది.. ఇకపై ఆంగ్లం, తెలుగు రెండు భాషల్లో నూ ఉత్తర్వులు జారీ చేయాలని వివిధ శాఖలకు ఆదేశాలు ఇచ్చింది సాధారణ పరిపాలన శాఖ.. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు జారీ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సిందిగా సూచించిన సర్కార్.. రెండు రోజుల్లోగా తెలుగులోనూ అదే ఉత్తర్వు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని వివిధ శాఖలకు సూచనలు ఇచ్చింది సాధారణ పరిపాలన శాఖ.. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో అనువదించడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్..
Read Also: India-China: లడఖ్లో ఏర్పాటు చేసిన చైనా కౌంటీలపై భారత్ అభ్యంతరం
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!