AP News: గత వైసీపీ ప్రభుత్వంలో బీసీ వర్గాలకు అందుబాటులో లేని సంక్షేమ పథకాలు, రాయితీల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కొత్త పథకాలలో ముఖ్యంగా మహిళలకు ఆర్థిక మద్దతు కల్పించేందుకు పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం కీలకంగా భావిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించగా, సీఎం చంద్రబాబు ఆమోదం పొందగానే వాటిని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.…
Nara Lokesh : సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి మంత్రి నారాలోకేష్ ఆశక్తి కర ట్వీట్ చేశారు. భారతదేశం మన్మోహన్ సింగ్ అస్తమయంపై శోకసంద్రంలో మునిగిన సమయంలో ఆయన మా కుటుంబం పట్ల చూపిన ప్రేమను గుర్తు చేసుకోవాలంటూ నారా లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ‘2004 మాకు పరీక్షా సమయం. అప్పడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారాన్నికోల్పోయింది.. చంద్రబాబు నాయుడుపైనా ఆ ఎన్నికల ముందే భయంకరమైన దాడి అలిపిరి ఘటన…
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్యాంగ రచనలో తెలుగువారి చిరస్మరణీయ పాత్రను గుర్తుచేశారు. 2025 సంవత్సరానికి రూపొందించిన అసెంబ్లీ క్యాలెండర్‌ను తన నివాసంలో శనివారం ఆవిష్కరించిన సందర్భంగా, తెలుగు ప్రముఖుల చిత్రాలతో, చరిత్రను ప్రతిబింబించేలా ఈ క్యాలెండర్ రూపొందించినట్లు సీఎం తెలిపారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోందని, ఈ సందర్భంలో రాజ్యాంగ రచనలో పాల్గొన్న తెలుగు ప్రముఖులను స్మరించుకుంటున్నామని చెప్పారు. గోబ్యాక్…
Perni Nani: డిసెంబర్ 10వ తేదీ నుంచి నా భార్య జయసుధ పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ ఆఫర్ లెటర్ ఇచ్చి అద్దెకు తీసుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు పనులు చేసానని అత్యుత్సాహంతో ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
AP DGP: రాష్ట్రంలో సైబర్ క్రైమ్ 34 శాతం పెరిగింది.. గంజా కేసులు 3 శాతం పెరిగాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. 97,760 గత సంవత్సరం రిపోర్ట్ అయిన క్రైమ్స్.. ఈ సంవత్సరం 92,094 క్రైం రిపోర్ట్ అయ్యాయి.. ఓవరాల్ క్రైం రేటు 5.2 శాతం తగ్గిందన్నారు. ఇ
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఆధిపత్యం అహంకారంతో అధికారులపై దాడులు చేస్తున్నారు.. ఇష్టారీతిన చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. తాట తీస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదు.. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారు.. ఎంపీడీవో జవహర్ బాబును అమానుషంగా కొట్టారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Job Mela In Vijayawada: విజయవాడ నగరంలో మెగా వికసిత్ జాబ్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, ఇతర టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో 60 ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు అందించాయి. జాబ్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, మన రాష్ట్రం కొన్ని కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, మన…
Tirumala Parakamani: తిరుమలలో ఉన్న పరకామణి పై వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పూర్తి విచారణ కోరారు. బీజేపీ నాయకులు భాను ప్రకాశ్ రెడ్డి, పాతూరి నాగభూషణం ఇటీవల రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావును కలిసినప్పుడు, తిరుమల పరకామణిలో విదేశీ డాలర్ల మాయపై పూర్తి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వారు, తిరుమల పరకామణిలో కనిపించకుండా పోయిన విదేశీ కరెన్సీ పై కూడా విచారణ జరిపించాలని కోరారు. ఈ కరెన్సీ పై…
Kadapa: కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక నాగేంద్ర అనే రైతు కుటుంబం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మొదట తన ఇద్దరు పిల్లలకు వ్యవసాయ పొలానికి చెందిన గేటుకు ఉరివేసి చంపి ఆపై భార్యాభర్తలు చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారు.