Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యశ్రీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో బీపీఎల్‌లో ఉన్న కోటి 40 లక్షలకు పైగా కుటుంబాలకు బీమా చేయించి వైద్య సేవలు అందించనుంది ప్రభుత్వం.. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు మంత్రి సత్యకుమార్.. ఈ ఏడాది ఏప్రిల్ 1 తేదీ నుంచి బీమా విధానంలో ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ, ఇన్సూరెన్స్ కంపెనీలు సంయుక్తంగా హైబ్రిడ్ బీమా విధానంలో వైద్య సేవలు అందిస్తాయన్నారు మంత్రి..
Read Also: TDR Bonds: టీడీఆర్ బాండ్లపై కీలక ఆదేశాలు.. అవి మినహా మిగతావి రిలీజ్..
మొత్తం 1.43 కోట్ల కుటుంబాలకు భీమా విధానంలో వైద్య సేవలు అందేలా హైబ్రిడ్ విధానం ఉంటుందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. 90 శాతం క్లెయిమ్‌లు రూ.2.5 లక్షల లోపే ఉంటున్నరాయన్న ఆయన.. రూ.2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు వ్యయం భరించేలా కొత్త విధానం అమలు చేయనున్నట్టు వెల్లడించారు.. హైబ్రిడ్ విధానంలో ప్రతీ కుటుంబానికి రూ.2,500 వరకూ ప్రీమియం ఉంటుంది.. ఆస్పత్రులకు బిల్లులురావనే ఇబ్బంది లేకుండా, రోగులను ఇబ్బందులకు గురి చేయకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు బిల్లులు చెల్లించేవిధంగా చర్యలు ఉంటాయన్నారు.. 2.5 లక్షల మించి వ్యయం అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చెల్లింపు ఉంటాయని.. అడ్మిట్ అయిన ఆరు గంటల్లో గా అప్రూవల్ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు.. చికిత్సలకు సంబంధించి గతంలో జరిగిన అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.. కొత్త హైబ్రిడ్ విధానంలోనూ 3,257 చికిత్సా విధానాలకు వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు మంత్రి సత్యకుమార్ యాదవ్..