టమాటా ధర ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో టమాటా మార్కెట్ కిలో టమాట రూపాయి, రూపాయి పావలా కూడా పలకని పరిస్థితి. 25 కిలోలు ఉన్న టమాటా బాక్సు 30 నుంచి 40 రూపాయలు లోపే అమ్ముకోవాల్సి వస్తోంది. పోనీ పంట ఎక్కువగా వస్తుంది.. ధర తగ్గిందా అంటే.. అదీ లేదు. వ్యాపారులకు సరిపడా టమాటా సరుకు రావడం లేదు. రేపో మాపో మార్కెట్ కూడా మూసివేయాల్సి వస్తోంది. అయినా టమాటాకు ధర మాత్రం…
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఫోకస్ పెట్టింది.. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు చేపట్టింది. ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు.. మొత్తంగా ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయని ఎక్సై్జ్ శాఖ చెబుతోంది.. ఏపీ వ్యాప్తంగా భారీగా లిక్కర్ అమ్మకాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. అక్టోబర్ 16వ తేదీ నుంచి నిన్నటి వరకు అంటే డిసెంబర్ 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,312 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది..
మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు మచిలీపట్నం కోర్టులో ఊరట దక్కింది.. అయితే, ఇదే సమయంలో.. విచారణకు సహకరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య జయసుధ మచిలీపట్నం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. గత వారం విచారణ ముగించిన జిల్లా కోర్టు.. విచారణను వాయిదా వేసిన విషయం విదితమే.. అయితే, బియ్యం మాయం కేసులో ఏ1గా ఉన్న…
ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్ట్ అయినా టీడీపీ హయాంలోనే ప్రారంభం అయ్యాయి అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో నది జలాల పంపిణీకి ఒప్పందం జరిగింది. ఏ ప్రాజెక్ట్ అయినా టీడీపీ హయాంలోనే ప్రారంభం అయ్యాయని.. పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభం అయ్యిందన్నారు.. అయితే, మేం మళ్లీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలు ఇవ్వడానికి ఆ ఆర్డినెన్స్ తీసుకువచ్చాం అన్నారు..
తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వారానికి రెండు సిఫార్సులేఖలకు అనుమతిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయానికి అంగీకారం తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారానికి రెండు... రూ.3 వందల దర్శనానికి సిఫార్సులేఖలకు ఏపీ సీఎం అనుమతించారు.. దీంతో.. టీటీడీ, సీఎం చంద్రబాబు.. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు శుభవార్త చెప్పినట్టు అయ్యింది..
న్యూఇయర్ సమీపిస్తున్న సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది.. కోరుకొండ మండలం బూరుపూడి గేటు దగ్గర ఉన్న నాగ సాయి ఫంక్షన్ హాల్లో రేవ్ పార్టీ నిర్వహించారు.. జిల్లా ఎస్పీకి వచ్చిన చమచారంతో పోలీసు ప్రత్యేక బృందాలు నాగసాయి పంక్షన్ హాల్లో తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు.