ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.. పలు కీలక అంశాలపై చర్చించారు.. కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేబినెట్.. అయితే, సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. పాలనా అంశాలు కొద్దిసేపు ముచ్చటించారు.. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపైన చర్చించారు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసే అంశంపై చర్చించారు..
Alcohol Drinking Effect: కొంతమంది వ్యక్తులు మద్యం తగిన సమయంలో వారు చేసి పనులు కొన్ని సార్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో మద్యం తాగడం విపరీతంగా పెరిగిపోయింది. మద్యం తాగడం కేవలం ప్రత్యేక సందర్భాలకు పరిమితమై ఉండకుండా.. ఏ సందర్భం అయినా అడ్డగోలుగా తాగడం మాములుగా మారింది. ఇక న్యూ ఇయర్ వేడుకలు అంటూ చాలామంది వారి స్నేహితులతో కలిసి ఇష్టానుసారంగా తాగి ఎంజాయ్ చేస్తుంటారు. మద్యం తాగి వారి…
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన సిట్ బృందంలో ప్రభుత్వం మార్పులు చేసింది. అక్రమ రవాణా కేసుల దర్యాప్తు, విచారణ కోసం గతంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. అయితే సిట్ బృందంలో కొందరు సభ్యుల నియామకంపై వచ్చిన అభ్యంతరాలపై సిట్‌లో మార్పులు జరిగాయి. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సుల మధ్య సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరు ఏమి చేసినా తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో కోటి ఎకరాలు సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఏపీలో జలయజ్ఞం పేరిట 23 ప్రాజెక్టులు పూర్తి చేశారని అన్నారు. చంద్రబాబు అన్నీ నేనే చేశా అంటాడు.. పోలవరం నాదే అంటారు.. హంద్రీనీవా నాదే అంటారు..
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, సాల్మన్ ఆరోక్య రాజ్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ కుమార్ ను రీడిజిగ్నెట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
గత ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కేంద్ర నిధులన్నీ మింగేశారు.. నిధులన్నీ పక్కదారి పట్టించారని తెలిపారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రతి ఇంటికి కులాయి ద్వారా నీరు ఇవ్వాలని ఏర్పాటు చేసిన స్కీము నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. తొందరపాటు చర్యలు వద్దని.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశం ఇచ్చింది. ఈ క్రమంలో.. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో ఏ6గా పేర్ని నాని ఉన్నారు. దీంతో.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.
పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. యలమందలో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందించారు.. ఆ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఒకప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టేవారు.. ఆడంబరాలు చేసేవారు.. చుట్టుపక్కల చెట్లు కొట్టేసేవారు అని ఎద్దేవా చేశారు.. ఒక ప్రజా ప్రతినిధి వస్తున్నారంటే దానికి గుర్తుగా మొక్కలు నాటాలి.. చెట్లు కొట్టకూడదు అని సూచించారు..