బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. న్యూఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ తనపై లేనిపోని ఆరోపణలు చేశాయన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అనంతపురంలో తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
పవన్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా.. ఓజీ.. ఓజీ అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.. అయితే, వాళ్లకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు పవన్.. తనను పని చేసుకోనివ్వండి అని గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.. ఇక, ఈ రోజు విజయవాడలో 35వ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరోసారి అదే అనుభవం ఎదురైంది.. పవన్ స్పీచ్ సమయంలో OG.. OG.. అంటూ నినాదాలు చేశారు అభిమానులు.. అయితే..…
ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. విశాఖ, విజయవాడలలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నారు. హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ విధానంలో కింద రోడ్డు దానిపైన ఫ్లైవోవర్ ఆపైన మెట్రో వస్తుంది.
విజయవాడలో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్‌ను ప్రారంభించారాయన.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకూ బుక్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పుస్తకాలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలు.. కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా వెనుకాడను.. కానీ, పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తాను…
మంత్రి వర్గ సమావేశంలో రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ వచ్చిందట.. కానీ, ఆ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి, ఎందుకు కావడం లేదు అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు.. దీంతో, త్వరలోనే పరిష్కారం అవుతాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.. కానీ, మనకు ఓపిక ఉంది.. ప్రజలకు ఓపిక ఉండాలి…
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు.. ఈ నెల విశాఖ పర్యటన ఖరారైనట్టు జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సమాచారం అందించారు.. 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు చేరుకోనున్నారు మోడీ.. అయితే, ఈ నెల 8 తేదీన ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రుల కమిటీని నియమించారు సీఎం చంద్రబాబు నాయుడు..
కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేక భేటీ.. ఏం చేద్దాం..? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.. పలు కీలక అంశాలపై చర్చించారు.. కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేబినెట్.. అయితే, సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. పాలనా అంశాలు కొద్దిసేపు ముచ్చటించారు.. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపైన చర్చించారు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు…
కృష్ణాజిల్లాలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల దేహ దారుఢ్య పరీక్షలో అపశృతి చోటుచేసుకుంది. 1600 మీటర్ల పరుగు పందెంలో పడిపోయిన యువకుడు... చికిత్స అందిస్తుండగా మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందాడు..
రెవెన్యూ సదస్సుల నిర్వహణపై మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ పాపాల కారణంగా రాష్ట్రంలో విపరీతంగా భూ సంబంధ సమస్యలు పెరిగిపోయాయి.. రెవెన్యూ సదస్సులకు వస్తున్న అర్జీలే ఇందుకు తార్కాణంగా పేర్కొన్నారు..