సంక్రాంతి కానుకగా జనవరి 10న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చెంజర్, 12న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్నాయి. అయితే ఈ రెండు సినిమాల టికెట్ ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘గేమ్ ఛేంజర్ రిలీజ్ రోజు 1 గంటల బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 600, మహారాజ్ బెన్ఫిట్ షోస్ కు రూ. 500 పెంచుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.అలాగే రెగ్యులర్ షోస్ కు మల్టీప్లెక్స్ టికెట్ ధరపై పై రూ. 135, సింగిల్ స్క్రీన్‌లపై రూ. 110 పెంచుతూ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
Also Read : Renu Desai : 1000 వర్డ్స్’ క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న రేణూ దేశాయ్
అయితే ఈ పెంచిన టికెట్ ధరలు పెంచటాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమాలకు ఇలా బెన్ ఫిట్ షో అనుమతి ఇవ్వటం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ప్రస్తావించారు పిటిషనర్. నిబంధనలకు విరుద్ధంగా ఏపీలో టికెట్ ధరలు పెంచారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ మేకర్స్ కు షాక్ ఇచ్చింది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల పాటు అధిక రేట్లు పెంచుతూ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ పిల్ పై విచారణ జరిపి 10 రోజులకు పరిమితం చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.