మరోసారి తన సొంత జిల్లా.. ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కుప్పం గ్రామీణ మండలం నడుమూరులో పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద ప్రజలకు రాయితీతో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ఏపీలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి.. ఆ తుది జాబితా ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,40,447కు పెరిగింది.. అందులో పురుష ఓటర్ల సంఖ్య 2,03,52,816గా ఉండగా.. మహిళా ఓటర్ల సంఖ్య 2,10,84,231గా ఉంది.. ఇక, థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 3400గా ప్రకటించింది ఈసీ.. వెలగపూడి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి ఈ జాబితాను విడుదల చేశారు..
మరోసారి తనకు ముఖ్యమంత్రి పదవి ఎలా వచ్చింది అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి.. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడారు.. నేను ముఖ్యమంత్రి పదవి ఎవరినీ అడగలేదు అన్నారు.. అందుకోసం ఎవరికీ కనీసం కప్పు టీ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.. కానీ, పదవి వచ్చినప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలనేది ఆలోచించాను.. అంతేకాదు..…
రోడ్లు వేయకుండా అడ్డుకుంటే ఊరుకోబోమని సర్పంచ్‌లను హెచ్చరించారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి.. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఈరోజు పర్యటించిన ఆమె.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్‌కు సంబంధించి ఆయా శాఖల ప్రతిపాదనలను ఈనెల 16 సాయంత్రం నాలుగు గంటల లోగా అందించాలని సీఎస్ విజయానంద్ తెలిపారు. కేబినెట్ సమావేశాల్లో భాగంగా.. గీత కార్మికులకు మద్యం షాపులు, రేట్ పెంపుపై కేబినెట్లో చర్చిస్తారు.
గన్నవరం పరిసర ప్రాంతాల్లో మరోసారి పులి సంచారం కలకలం రేపుతుంది. పులి కదలికలపై స్థానికుల్లో భయాందోళనలు నెలకున్నాయి. ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్తున్న సమయంలో పులి రోడ్డు దాటడం చూసినట్టు ఆర్టీసీ కండక్టర్ రవి కిరణ్ చెబుతున్నాడు. ఆగిరిపల్లి మండలం కళ్ళుటూరు గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ బొకినల రవి కిరణ్ ఉదయం డ్యూటీకి వెళ్తుండగా పులిని చూశాడు.
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈనెల 8న మోడీ విశాఖకు రానున్నారు. పర్యటనలో భాగంగా.. ఎన్టీపీసీ ప్రాజెక్ట్, వైజాగ్ రైల్వే జోన్, జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. అంతేకాకుండా.. కొన్ని పూర్తి అయిన ప్రాజెక్ట్‌లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
కృష్ణా జిల్లా కేసరపల్లిలో హైందవ శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, వర్రే కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. బ్రహ్మాండ నాయకుడు అన్న పదం ఉందని ఒక సినీ దర్శకుడు కాదన్నాడని.. పాట వద్దన్నందుకు తాను అతనికి పాట రాయడం మానేసానని తెలిపారు.
ఈరోజు తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, డీఏ బకాయిలు, పీఆర్సీ ఏర్పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఉద్యోగుల ప్రమోషన్లు, శాఖల వారీగా విధుల విభజనపై కార్యవర్గ సమావేశంలో చర్చించారు.