AP Crime: కూతురి ప్రేమ పెళ్లికి సహాయం చేసిన వ్యక్తి హత్యకు కుట్ర..! రంగంలోకి సుపారీ గ్యాంగ్.. ట్విస్ట్ ఏటంటే..?
- తన కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తి హత్యకు కుట్ర..
- సుపారీ ఇచ్చి మరీ గ్యాంగ్ ను దించిన యువతి తండ్రి..
- చివరి నిమిషంలో బెడిసికొట్టిన ప్లాన్.. నలుగురి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ప్రేమించుకున్నవారు పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే.. ఫ్రెండ్స్, తెలిసినవాళ్లు.. ముందుండి మరీ పెళ్లి చేస్తుంటారు.. కానీ, వారే టార్గెట్‌గా మారిపోయిన సందర్భాల్లో ఎన్నో ఉంటాయి.. తన కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తిని సుపారీ ఇచ్చి మరీ హత్య చేయడానికి ప్లాన్ చేశాడో ఓ వ్యక్తి.. కోడి కత్తులతో పొడిచి హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రచించారు.. అయితే, హత్య చేసేందుకు రెక్కి చేస్తుండగా నిందితులను అనుమానం వచ్చి పోలీసులు పట్టుకున్నారు.. ఈ కేసు వివరాలను నందిగామ ఏసీపీ తిలక్ మీడియాకు వెల్లడించారు.
Read Also: Masthan Sai: హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్.. హార్డ్ డిస్కులో ప్రయివేటు వీడియోలు?
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన మువ్వ వీర్రాజును 14 నెలల క్రితం ఏ కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కోలా నరసింహారావు కుమార్తె రమ్యశ్రీ ప్రేమించి వాహనం చేసుకుంది. ఈ ప్రేమ వివాహానికి ప్రేమికుడు వీర్రాజు సమీప బంధువు ఏ కొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామంలో విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న మువ్వ గోపి సహకరించాడు. దీంతో ప్రేమ వివాహానికి సహకరించాడనే కారణంతో మువ్వా గోపిని హత్య చేసేందుకు రమ్యశ్రీ తండ్రి కోలా నరసింహారావు ప్రణాళిక వేశాడు. హత్యకు హైదరాబాద్ కు చెందిన పాలంపల్లి విజయ్ కుమార్ కు లక్ష రూపాయలకు సుఫారీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజు మరో ఇద్దరితో కలిసి మొత్తం నలుగురు ఐతవరంలో ఉన్న మొవ్వ గోపిని హత్య చేసేందుకు రెక్కి నిర్వహించారు.
Read Also: Masthan Sai: హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్.. హార్డ్ డిస్కులో ప్రయివేటు వీడియోలు?
అయితే, ఆ సమయంలో కుదరపోవటంతో ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం నాడు గోపిని హత్య చేసేందుకు నందిగామ మయూరి టాకీస్ సెంటర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు.. దీనిపై నందిగామ సీఐకి సమాచారం రావడంతో ఆయన సిబ్బందితో కలిసి నలుగురిని అదుపుకొని అదుపులో తీసుకొని విచారించగా.. హత్య కుట్ర బహిర్గతమైంది. వారి వద్ద నుంచి కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు. నిందితులను కోర్టులో ఆధారపరచునున్నట్లు నందిగామ ఏసీపీ తిలక్ వెల్లడించారు..
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!