Railway Budget For AP: ఈ బడ్జెట్ లో ఏపీకి రూ. 9,417 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయింపులు జరిగాయని తెలిపారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్.. ఈ బడ్జెట్ లో యూపీఏ హయాంలో కంటే ఏపీకి 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామన్నారు.. ఏపీలో మొత్తం అమలవుతోన్న రైల్వే ప్రాజెక్టులు రూ. 84,559 కోట్ల వరకు కేటాయించామన్నారు.. కొత్త ప్రాజెక్టులు ఓ పద్ధతిలో, శాస్త్రీయమైన రీతిలో కేటాయింపులు జరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులను బడ్జెట్ లో ప్రకటించడం లేదన్నారు.. ఇక, రైల్వే శాఖ మంత్రి ప్రెస్ మీట్ ను వర్చువల్ గా వీక్షించిన డీఆర్ఎంలు…
Read Also: Delhi Elections: ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండే పోలింగ్
తెలంగాణలో మొత్తం రైల్వే లైన్లు అన్నీ విద్యదీకరణ జరిపాం.. కవచ్ లొకేషన్ సెంటర్ సికింద్రాబాద్ లో ఉంది.. 1326 కిలోమీటర్లు సికింద్రాబాద్ సెంటర్ గా కవర్ అవుతుందన్నారు అశ్వనీ వైష్ణవ్.. 200 వందేభారత్ రైళ్ళకు అనుమతి లభించింది.. నవభారత్ రైళ్ళు విజయవాడ – హైదరాబాద్ మధ్య నడపాలని నిర్ణయించాం.. అమృత్ భారత్ రైళ్లలో 450 రూపాయలకే 1000 కిలోమీటర్లు పయనించేలా సౌకర్యం కల్పిస్తున్నాం.. వంద అమృత్ భారత్ రైళ్ళు త్వరలో తీసుకొస్తాం.. ఏపీ కొత్త రాజధాని కోసం కూడా ఒక ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది.. ఏపీలో 9417 కోట్లు రైల్వే అభివృద్ధికి ఏర్పాటు చేశారు.. 100 శాతం విద్యుదీకరణ ఏపీలో పూర్తయ్యిందన్నారు.. 1560 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ లు గత సంవత్సరం పూర్తయ్యాయి.. శ్రీలంకలో ఉన్న రైల్వే లైన్ల కంటే ఏపీలో ఉన్న నెట్వర్క్ పెద్దది.. రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధిలో సీఎం చంద్రబాబు సహకారాన్ని నేను అభినందిస్తాను అన్నారు.. ఏపీకి 200 వందేభారత్, 100 నమోభారత్ రైళ్లను ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు అశ్వనీ వైష్ణవ్..
Read Also: Sonu Sood: సోనూసూద్ ట్రస్ట్ తరపున ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్ లు
ఇక, ఈ సందర్భంగా రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ మాట్లాడుతూ.. రూ.9,417 కోట్లు ఈ సంవత్సరానికి ఏపీకి బడ్జెట్ లో ఏర్పాటు కాంగ్రెస్ పాలన కంటే 10 రెట్లు ఎక్కువన్నారు.. 73 స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం.. 8 వందే భారత్ లు ఏపీలో ఉన్నాయి.. 200 కొత్త వందే భారత్ రైళ్ళు రాబోతున్నాయి.. నమోభారత్ రైళ్ళు దగ్గర స్టేషన్ల మధ్య తిరుగుతాయి.. అమృత్ భారత్ రైళ్ళు ఆర్ధిక వెసులుబాటు ఇవ్వడానికి నిర్ణయించారు.. 24th అక్టోబర్‌న కేబినెట్ అనుమతి రాష్ట్ర రాజధాని ప్రాజెక్టుకు వచ్చిందన్నారు.. ఎరుబాలెం, నంబూరు అమరావతి లైన్ ను రాబోయే నాలుగేళ్ళలో పూర్తి చేస్తాం.. సీఎం చంద్రబాబు రైల్వే లైనుకు సంబంధించిన భూ సమీకరణను త్వరగా చేయాలని అధికారులను ఆదేశించారు.. వందే స్లీపర్ రైళ్ళ టెస్టింగ్ జరుగుతోందన్నారు..
Read Also: Ashwini Vaishnav: తెలంగాణకు కేటాయించిన రైల్వే ప్రాజెక్ట్‌లపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
మరోవైపు.. విజయవాడ డివిజన్ స్ధూల ఆదాయం 3.62% పెరిగిందని వెల్లడించారు నరేంద్ర ఆనందరావు పాటిల్.. ఈ సంవత్సరం 5వేల కోట్ల స్ధూల ఆదాయం దాటి సంపాదిస్తాం అని వెల్లడించారు.. విజయవాడ రైల్వేస్టేషన్ 500 కోట్ల ఆదాయాన్ని దాటింది.. రాజమండ్రి స్టేషన్ పునః నిర్మాణం త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తాం.. నెల్లూరు స్టేషను అభివృద్ధి వచ్చే ఆర్ధిక సంవత్సరంలో పూర్తవుతుంది.. విజయవాడను అడ్వాన్స్‌డ్ స్టేషన్ గా అభివృద్ధి చేస్తాం అని పేర్కొన్నారు.. ఇంకోవైపు.. విశాఖ DRM మనోజ్ కుమార్ సాహూ మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి నిధులు కేటాయింపు ఉంటుంది.. పూర్తి వివరాలు రావాల్సి ఉంది… నిలిచిపోయిన విశాఖ రీ దేవలెప్ మెంట్ పనులు త్వరలో నే ప్రారంభం అవుతాయి.. దీనికి సంబంధించిన టెండర్లు ను మళ్ళీ పిలిచాము.. దేశంలో రెండు అమృత భారత్ రైళ్లు నడుస్తున్నాయి.. ఒకటి విశాఖ మీదుగా నడుస్తున్నాయి.. సామాన్య ప్రయాణికులకు వందే భారత్ తరహా లో సౌకర్యవంతంగా అంతే వేగంగా ప్రయాణిస్తుంది.. ప్రస్తుతం 11 రైల్వే స్టేషన్ లలో అమృత్ భారత్ పథకం కింద రూ.800 కోట్లతో జరుగుతున్నాయని తెలిపారు..