Nandamuri Balakrishna: విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అలియాస్ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.. ఇక, ఆయన కుమారుడైన టీడీపీ ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణను ఈ మధ్యే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ వరించింది.. అయితే, ఈ అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ.. నాకు పద్మభూషణ్ కాదు.. నాన్న (ఎన్టీఆర్)కు భారతరత్న రావాలని వ్యాఖ్యానించారు.. నాకు పద్మభూషణ్ అవార్డు కంటే.. నాన్నకు భారతరత్న అవార్డు రావాలని అనేది కోట్లాదిమంది తెలుగు ప్రజలు ఆకాంక్షగా పేర్కొన్నారు.. కచ్చితంగా నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు.. ఆయనకు భారతరత్న అవార్డును.. తెలుగు ప్రజలు, తెలుగు జాతీయ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ..
Read Also: Rahul Gandhi: యూపీఏ, ఎన్డీఏ పాలనపై రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
అయితే, తనకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు బాలయ్య.. తనలో ఈ అవార్డు మరింత కసి పెంచిందన్న ఆయన.. అందుకే అంటున్నా.. తన రెండో ఇన్నింగ్స్ ఇక్కడి నుంచి మొదలైందన్నారు.. తనకు ప్రతీ పాత్ర ఛాలెంజ్‌గా ఉంటుంది. తనకు తానే ఛాలెంజ్.. తన పాత్రను తానే ఛాలెంజ్‌గా తీసుకుంటున్నాను అన్నారు.. నా గురించి నేను తెలుసుకోవడమే గొప్ప విద్యగా చెప్పుకొచ్చారు బాలయ్య.. ఒకదానితో తృప్తి పడొద్దు.. అవకాశాలు వస్తున్నాయి.. ఆదరిస్తున్నారు కాబట్టి.. ఇంకా మనం మన్నళ్లి ఎలా పదును పెట్టుకోవాలని ఆలోచించాలి అన్నారు.. ఈ సమయంలో ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డుపై మీడియా ప్రశ్నించగా.. ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుంది.. తప్పకుండా వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఆయనకు భారతరత్న వచ్చేవరకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ..