CM Chandrababu: మరికొన్ని పథకాలపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో.. రైతులకు రుణాలు.. బ్యాంకర్ల పాత్రపై ముఖ్యంగా చర్చించబోతున్నారు.. ఇక, తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టడంతో.. బ్యాంకర్లకు కీలక సూచనలు ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు.. సంక్షేమ కార్యక్రమాలు.. రైతులకు రుణాలు విషయంలో బ్యాంకర్లు ప్రభుత్వానికి సహకరించాలని బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేయబోతున్నారట.. బ్యాంకర్లు సహకరిస్తేనే.. ఏపీ అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయి. ఏ పథకం కొనసాగాలన్నా.. బ్యాంకర్ల సపోర్ట్ అవసరం. రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో.. బ్యాంకర్లతో సమావేశానికి రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు..
Read Also: TGCHE: ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారా?.. ఇకపై ఒక్కో ప్రశ్నకు రూ. 500 ఫీజు