Minister Nara Lokesh Delhi Tour: ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లనున్న నారా లోకేష్.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఈ రోజు రాత్రికి భేటీ కానున్నారు. ఇటీవల రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి నిధులు కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలపనున్నారు. కొత్తగా రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది.. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ విధానాన్ని వివరించనున్నారు. విశాఖను ఐటీ హబ్‌గా, రాలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చేందుకు ప్రోత్సహకాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు మంత్రి నారా లోకేష్..
Read Also: Gongidi Trisha: రెండేళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు.. నా కూతురు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది
మరోవైపు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పలు రాష్ట్రాల్లో రైల్వే పనులు జరుగుతున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా ఏపీ రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన తీసుకువచ్చారు. ఏపీలో రూ. 9 వేల 417 కోట్ల విలువైన రైల్వే పనులు ఇప్పటికే జరుగుతున్నాయని వెల్లడించారు. అందుకే బడ్జెట్ లో ప్రత్యేకంగా ఏపీ గురించి ప్రస్తావించలేదని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించామని తెలిపారు. యూపీఏ హయాంలో కేటాయించిన నిధుల కంటే 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామని చెప్పారు. ఇక, ఏపీలో 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తున్నామని వెల్లడించారు. ఆయా రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్న విషయం విదితమే..