Minister Narayana: గత రెండు మూడు రోజులుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ‘జీరో’ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, మంత్రి నారాయణ విశాఖపట్నం పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నారాయణను కలిశారు పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ… వర్మను జీరో చేశామనే వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.. టెలీ కాన్ఫరెన్స్ లో నేను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని మండిపడ్డారు..…
TTD Parakamani Case : టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సీజ్ చేసిన వివరాలు సీల్డ్ కవర్ లో హైకోర్టు రిజిస్టర్ కి అందజేశారు సీఐడీ అధికారులు. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయనందుకు టీటీడీపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్ వేయకుండా జాప్యం చేసినందుకు ఏపీ న్యాయవాదుల అసోసియేషన్ కి 20 వేల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించారు…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు.. శ్రీశైలం మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత కర్నూలు శివారులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు, వివిధ శాఖల అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది.. నిందితుల బెయిల్ పిటిషన్ల మీద విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. దీంతో, మొత్తం ఏడుగురు నిందితుల బెయిల్ పిటిషన్ల మీద ఈ నెల 24వ తారీఖున తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు పేర్కొంది. అయితే, అప్పటి వరకు నిందితుల రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న…
Big Relief To MP Mithun Reddy: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది.. న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.. న్యూయార్క్ వెళ్లేందుకు మిథున్ రెడ్డికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.. కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో…
Deputy CM Pawan Kalyan: 100 రోజుల ప్రణాళిక అమలుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.. సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్తలు, రాష్ట్ర అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో చర్చించారు.. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. అధికార యంత్రాంగం, శాస్త్రవేత్తలతో సమాలోచనలు చేశారు.. మత్స్యకారులలో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు…
YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ దిగజారి పోయిందని.. ప్రజలకు స్వేచ్చ లేకుండా పోయిందని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి.. పోలీసులను ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారం వాడుకుంటున్నారని.. నల్లపాడు పీఎస్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసులో మా పార్టీ కార్యకర్తను అరెస్టు చేశారన్నారు.. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో వైసీపీ తరపున గట్టిగా నిలబడ్డాడని వీరయ్య అనే తమ పార్టీ కార్యకర్తను అరెస్టు చేశారన్నారు.. మధ్యవర్తినామాలో పోలీసులు ఇష్టానుసారం…
AP High Court: తెలుగుదేశం పార్టీకి చెందిన కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవరెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి మేయర్ సురేష్‌బాబు నేతృత్వంలో మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానాలను రద్దు చేసే అధికార పరిధి మునిసిపల్ కమిషనర్‌కు లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మాధవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానాలను రద్దు చేసే అధికార పరిధి మునిసిపల్ కమిషనర్ లేనే లేదని ధర్మాసనం…