శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం తెనాలి పట్టణం సుల్తానాబాద్ లో వడ్డెర కాలనీ, సుగాలి కాలనీ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, తెనాలి డి.ఎస్.పి బి జనార్ధన రావు నేతృత్వంలో ఈ ప్రాంతంలోని దాదాపు 350 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని నలుగురు సీఐలు, ఎస్ఐలతో సహా 160 మంది దాకా సిబ్బంది…
Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆ తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగి పోయింది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు సాకే శైలజానాథ్. ఆయన వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
Ram Gopal Varma: గత ఏడాది నవంబర్ 11వ తేదీన టీడీపీ లీడర్ రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నేడు పోలీసు విచారణకు హాజరుకానున్నారు రాంగోపాల్ వర్మ. ఇవాళ ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. కాగా ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆర్జీవీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే…
Antarvedi: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు (ఫిబ్రవరి 7) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం జరగనుంది. నేటి రాత్రి 10:30 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరగనుంది.
ప్రశ్నకే.... ప్రశ్నలు ఎదురవుతున్నాయా? నిలదీస్తానన్న స్వరానికే నిలదీతలు పెరుగుతున్నాయా? ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ను వైసీపీ నేతలు అడుగుతున్న తీరు చూస్తుంటే... ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ప్రభుత్వంలో ఎక్కడ తప్పు జరిగినా... తేడాగా ఏం చేసినా... ప్రశ్నిస్తా, నిలదీస్తానని గతంలో స్టేట్మెంట్స్ ఇచ్చారు పవన్.
సంక్రాంతి పండుగ తర్వాత వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటన ఉంటుందని సమాచారాన్ని ఇచ్చారు.. కానీ, జగన్ జిల్లాల పర్యటన కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి వచ్చేలా ఉంది.. జిల్లాల టూర్ పై ఆయన ఇంకా ఓ స్పష్టతకు రాకపోవటమే అందుకు కారణంగా కనిపిస్తోంది.. మరి కొన్ని జిల్లాల సమీక్ష సమావేశాలు పెండింగ్ లో ఉండటంతో అవి పూర్తయిన తర్వాత ఆయన జిల్లాల పర్యటన ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.