Pankajasri: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వంశీ భార్య పంకజ శ్రీ.. వంశీ అరెస్ట్ సక్రమంగా జరగలేదన్న ఆమె.. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయనే తెలుస్తోంది.. అరెస్ట్ అక్రమం అనేది కూడా స్పష్టం అవుతోందన్నారు.. ఇక, తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని మెజిస్ట్రేట్‌కి వంశీ తెలిపారని గుర్తుచేశారు.. పోలీస్‌స్టేషన్‌లో వంశీ పట్ల పోలీసులు తప్పుగా ప్రవర్తించారు.. నా భర్త అరెస్ట్‌పై న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ.. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ పడింది. దీంతో వంశీని పటిష్ట భద్రత మధ్య విజయవాడ సబ్ జైలుకు తరలించారు పోలీసులు. వంశీని హైదరాబాద్.. రాయదుర్గంలో నిన్న ఉదయం అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన విజయవాడకు తీసుకెళ్లిన ఏపీ పోలీసులు.. రాత్రి ACMM కోర్టులో హాజరుపర్చారు. వంశీతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఏ7 ఎలినేని వెంకట శివరామకృష్ణ, ఏ8 నిమ్మ లక్ష్మీపతిలకు కూడా కోర్టులో హాజరుపర్చారు. ప్రభుత్వం తరఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట 45 నిమిషాల వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో అదనంగా మరో అరగంటపాటు వాదనలు విన్నారు జడ్జి. ఆ తర్వాత వంశీతో పాటు శివరామకృష్ణ, నిమ్మ లక్ష్మీపతిలకు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
ఇక, తన భర్త వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు పంకజశ్రీ. రాజకీయ ఒత్తిళ్లతోనే అరెస్ట్ జరిగిందని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. థ్రెట్ ఉందనే విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తన భర్త వంశీ తీసుకెళ్లారని చెబుతున్న పంకజశ్రీ.. ఎన్టీవీ ప్రతినిధితో ఇంకా మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..