ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ ఏపీ సచివాలయంలో సమావేశమైంది.. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణపై జరిగిన ఈ మంత్రుల కమిటీ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు..
కీలక నేత, మాజీ మంత్రి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో.. పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్..
14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడ లేదన్నారు.. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ప్రధాన కార్యదర్శి, సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ.. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అనేది చర్చనీయాంశంగానే మారిపోయింది. 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడ లేదన్నారు.. పోలవరం నీటినిల్వ 41.15 కి కేంద్రం కుదించాలని చూస్తోందన్న ఆయన.. అలా కాకుండా 45.72 కొనసాగిస్తే, 900 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి, 80…
రియల్ ఎస్టేట్లో నష్టాలు రావడంతో ఓ వడ్డీ వ్యాపారి 20 కోట్ల రూపాయలకు పైగా టోకరా పెట్టాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో ఈ ఘటన కలకలం రేపుతుంది. వడ్డీ వ్యాపారిగా ఉన్న కూర్మదాసు హేమంత్.. కొత్తపేట మెయిన్ రోడ్ లో సత్య సూర్య బ్యాంకర్స్ ను ప్రారంభించి ఇందులో పార్టనర్ గా ఉన్నారు.. అయితే హేమంత్ తాకట్టు వడ్డీ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మరొకరితో భాగస్వామ్యగా ఉన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీ లకు కేటాయించేలా కేబినెట్ ఆమోదం తెలిపింది.. తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడంపై మంత్రులు దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు... నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీలకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు..
రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది ఏపీ సీఆర్డీఏ.. అయితే, సీఆర్డీఏ రాసిన లేఖకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది.. టెండర్ ప్రక్రియకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది.. అయితే ఎన్నికలు పూర్తి అయ్యాక మాత్రమే టెండర్లను ఫైనలైజ్ చేయాలని స్పష్టం చేసింది.
ఫైన్ల క్లియరెన్స్ విషయంలో తన కేబినెట్లో ఏ మంత్రి.. ఏ స్థానంలో ఉన్నారు అనే విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు.. డిసెంబర్ వరకూ ఫైళ్లు క్లియరెన్స్ లో మంత్రుల పనితీరు చదివి వినిపించారు.. అయితే, ఫైళ్ల క్లియరెన్స్ విసయంలో 6వ స్థానంలో తాను ఉన్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సూచించారు.. ఈ లిస్ట్లో మొదటి స్థానంలో మంత్రి ఫరూఖ్ ఉండగా.. చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.. ఇక,…