Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 03 02 2026

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Published Date :February 3, 2026 , 9:01 pm
By Gogikar Sai Krishna
  • గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై హైకోర్టు విచారణ
  • పిచ్చికి పరాకాష్ట.. కనుగుడ్లపై టాటూ వేయించుకున్న యువకుడు..
  • ముగిసిన ఉపసంహరణ గడువు.! రాత్రికి ఎస్ఈసీ కీలక ప్రకటన!
  • మణిపూర్ కొత్త సీఎంగా ఖేమ్‌చంద్ సింగ్..
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

విద్యార్థి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పలువురు అరెస్ట్!

కృష్ణాజిల్లా పోరంకిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనవరి 30న హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ ఉరివేసుకుని పవన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2025 డిసెంబర్ నెలలో పవన్ కుమార్ తోటి విద్యార్థి హేమంత్ కి హాస్టల్లో చెలరేగిన వివాదంతో జనవరి 5న పవన్ ను హేమంత్ కొట్టాడు. కొట్టిన దృశ్యాలు ఇంస్టాగ్రామ్ లో హేమంత్ పోస్ట్ చేశాడు. జనవరి 30న మరోసారి పవన్ కుమార్ పై హేమంత్ దాడి చేశాడు.దీంతో మనస్థాపానికి గురై హాస్టల్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని పవన్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారకులైన వారి పేర్లు తన చేతిపై పవన్ రాసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలను గోప్యంగా చైతన్య యాజమాన్యం ఉంచింది. ఈ విషయంలో సాక్షాలను శ్రీ చైతన్య యాజమాన్యం తారుమారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి చేతిపై ఉన్న పేర్లు శ్రీ చైతన్య సిబ్బంది తుడిచేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనితో కాలేజీ ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఇంచార్జ్ రవీంద్ర, జూనియర్ లెక్చరర్ లు రాజేష్, ఆనంద్, కృష్ణ మెస్ బాయ్ హేమంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
  • Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
  • Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్‌.. పగటి కలలు మానుకో..!
  • Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..

మేడారం జాతర దిగ్విజయం.. దొంగ ప్రచారాలకు తావులేదు..

మేడారం మహాజాతర అత్యంత వైభవంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగియడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గత జాతరల కంటే మెరుగైన ఏర్పాట్లు చేశామని, అమ్మవార్ల ఆశీస్సులతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని ఆమె కొనియాడారు. ఈ ఏడాది జాతర అంచనాలకు మించి జరిగిందని మంత్రి తెలిపారు. “క్లాస్, మాస్ అనే తేడా లేకుండా హైక్లాస్ పీపుల్ కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నాం” అని ఆమె పేర్కొన్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో ‘తిరుగు జాతర’ నిర్వహణతో ఈ వేడుకలు పూర్తిస్థాయిలో ముగుస్తాయని వెల్లడించారు.

గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై హైకోర్టు విచారణ

గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల బదలాయింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రూ. 5000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను గీతం సంస్థకు కట్టబెట్టడంపై హైకోర్టులో పిల్ వేశారు విశాఖ న్యాయవాది గ్రేస్. ఆయన రాజకీయ ప్రయోజనాలతో ప్రజలకు సంబంధించిన భూములను ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం చట్ట వ్యతిరేకమని అన్నారు పిటిషన్ తరపు న్యాయవాది. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు మార్గాల ద్వారా ప్రభుత్వ భూములను గీతం సంస్థకు అప్పజెప్పాలని ప్రయత్నిస్తోందని వాదించారు.

మణిపూర్ కొత్త సీఎంగా ఖేమ్‌చంద్ సింగ్..

మణిపూర్ కొత్త సీఎంగా బీజేపీకి చెందిన యమునాం ఖేమ్‌చంద్ సింగ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. జాతి ఘర్షణల కారణంగా గత రెండేళ్లుగా మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది క్రితం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. మైయితేయిలు, కుకీల మధ్య ఏర్పడిన సంఘర్షణ కారణంగా గతేడాది సీఎంగా ఉన్న బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఆ రాష్ట్రంలో ఖేమ్‌చంద్ సింగ్ ను తదుపరి సీఎంగా ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ శాననసభాపక్ష నేతా ఎన్నికైన తర్వాత, ఈ ప్రకటన వెలుబడింది.

పీఎం మోడీ మాస్టర్ స్ట్రోక్.. వారంలో రెండు ఒప్పందాలు!

ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కటే టెన్షన్.. ట్రంప్ కు ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు టారిఫ్లు బాధుతారన్న భయం. ట్రంప్ చేస్తున్న టారిఫ్ యుద్ధానికి అన్ని దేశాలు వణకిపోతున్నాయి. ఒకవైపు అగ్రరాజ్యాల అంక్షలు, మరోవైపు గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న అనిచ్చితి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ భారత్ మాత్రం తన దౌత్య వ్యూహాన్ని ప్రదర్శించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే అటు యూరోపియన్, యూనియన్ ఇటు అమెరికాతో భారత్ కుదుర్చుకున్న రెండు మెగా ట్రేడ్ డీల్స్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.

విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్.. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు!

తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై తిరుపతి పోలీసులు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యూనివర్సిటీలో అధిక ఫీజులపై నిరసన తెలపడానికి విద్యార్థి సంఘం నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నేతలైన అక్బర్, వినోద్‌లను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు వాహనంలో బలవంతంగా ఎక్కించి కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘం నేత బండి చలపతి తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాప్‌కు గురైన విద్యార్థులను వెతికే చర్యలు చేపట్టారు. అనంతరం కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసులు చేజ్ చేసి అడ్డగించారు. ఈ సందర్భంగా కిడ్నాప్‌కు పాల్పడినట్లు భావిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కిడ్నాప్‌కు గురైన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు సురక్షితంగా రక్షించారు.

అడివి శేష్ వర్సెస్ రణ్‌వీర్ సింగ్.. డెకాయిట్ రిలీజ్ డేట్ మారబోతుందా?

బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రం ‘ధురంధర్’. ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇక ఇప్పుడు ‘ధురంధర్ ది రివెంజ్’ అంటూ సీక్వెల్ చిత్రాన్ని థియేటర్స్‌లోకి తీసుకురావడానికి రడీ అవుతున్నారు మేకర్స్. నేడే ఈ చిత్ర టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ధురంధర్ 2’ 2026 మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు రడీ అవుతుంది. మరోసారి థియేటర్స్‌లో దుమ్ములేపడానికి రడీ అవుతున్న ‘ధురంధర్ 2’ సినిమా కారణంగా మార్చిలో రిలీజ్ కావాల్సిన కొన్ని చిత్రాలకు ఇబ్బందులు తప్పడం లేదంటూ సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ధురంధర్ దెబ్బకు అవి రిలీజ్ డేట్‌లను సర్దుబాటు చేసుకోడానికి రడీ అవుతున్నట్లు సమాచారం. ఈ వరుసలో యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’ కూడా ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఈ సినిమాను మార్చి 19న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అదే రోజున ధురంధర్ 2 థియేటర్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రడీ అవుతుండటం, ఇప్పటికే రిలీజ్ అయిన ధురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీ కారణంగా ఆ టైంలో మరే ఇతర సినిమాలు రిలీజ్‌కు ప్లాన్ చేసుకోడానికి వెనకా ముందు ఆడుతున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద అడివి శేష్ వర్సెస్ రణ్‌వీర్ సింగ్ వార్ జరుగుతుందా, లేదంటే ‘ధురంధర్ ది రివెంజ్’ దెబ్బకు ‘డెకాయిట్’ వాయిదా వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ‘డెకాయిట్’ మేకర్స్ సినిమా పోస్ట్‌పోన్‌పై ఎలాంటి అఫీషియల్ అన్సౌన్స్‌మెంట్ చేయలేదు. డెకాయిట్ సినిమా విషయానికి వస్తే షేనియల్ డియో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

‘‘మా సైన్యం వల్ల కావడం లేదు’’.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)ను ఎదుర్కోవడంలో తమ సైన్యం వల్ల కావడం లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. బలూచిస్తాన్ విస్తీర్ణం పెద్దది కావడంతో పాక్ భద్రతా బలగాలు అలసిపోతున్నాయని చెప్పారు. జాతీయ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… పాకిస్తాన్‌లో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ విస్తీర్ణమే భద్రతా బలగాలకు ప్రధాన సవాల్ అని అన్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల నేపథ్యంలో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బలూచిస్తాన్ భూభాగం పాకిస్తాన్లో 40 శాతానికి పైగా ఉందని, జనసాంద్రత ఉన్న నగరాలను నియంత్రించడం కన్నా, ఇంత పెద్ద ప్రాంతాన్ని కాపాడటం చాలా కష్టమని, భారీ సంఖ్యలో బలగాలు అవసరం అవుతాయని అన్నారు. సైన్యం అక్కడ పనిచేస్తున్నా, అంత పెద్ద ప్రాంతాన్ని గస్తీ కాయడం వల్ల మా సైన్యం అలసిపోతోందని రక్షణ మంత్రి చెప్పారు.

ముగిసిన ఉపసంహరణ గడువు.! రాత్రికి ఎస్ఈసీ కీలక ప్రకటన!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు నిర్దేశించిన గడువు నేటితో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అభ్యర్థుల తుది జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈ రాత్రి లోపు లేదా రేపు ఉదయానికల్లా అధికారికంగా పోటీలో ఉన్న అభ్యర్థుల పూర్తి వివరాలను ఎస్ఈసీ ప్రకటించనుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ , బీజేపీ అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు ఎంతమంది బరిలో ఉన్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పిచ్చికి పరాకాష్ట.. కనుగుడ్లపై టాటూ వేయించుకున్న యువకుడు..

ప్రస్తుత కాలంలో యువత విభిన్నంగా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జగదీష్ అనే యువకుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి, భయానికి గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారిగా ఐబాల్ టాటూ (Eyeball Tattoo) వేయించుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందాలని అతను తన కనుగుడ్లపై టాటూ వేయించుకున్నాడు.ఐటీఐ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన జగదీష్, ప్రస్తుతం టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. టాటూలు, పియర్సింగ్ వంటి విభాగాల్లో నేపాల్‌లో శిక్షణ పొందాడు. చిన్నప్పటి నుండి ఏదైనా కొత్తగా, డిఫరెంట్‌గా చేయాలనే తపనతో అతను ఈ అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కంటిలో చిన్న నలుసు పడితేనే తట్టుకోలేము, అలాంటిది సూదులతో ఇంకును నేరుగా కంటి లేయర్లలోకి పంపడం అనేది వినడానికే భయంకరంగా ఉంది. ఈ టాటూ ప్రక్రియకు దాదాపు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. దీని కోసం జగదీష్ సుమారు రూ. 2 లక్షలు ఖర్చు చేశాడు (సాధారణంగా ఇది రూ. 5 లక్షల వరకు ఉంటుంది). నిపుణులు , వైద్యులు 50-50 శాతం ప్రమాదం ఉంటుందని, చూపు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించినా అతను వెనక్కి తగ్గలేదు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • municipal elections
  • telugu news
  • Top Headlines 9pm

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions