వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్.. మరో ఇద్దరికి కూడా..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ రిమాండ్ విధించింది కోర్టు. వంశీతో పాటు కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే.. వంశీ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలను చేర్చారు. సత్యవర్ధన్‌ను బెదిరించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వంశీ, అతడని అనుచరులు సత్యవర్ధన్‌ను బెదిరించినట్టు పోలీసులు రిమాండ్‌లో చేర్చారు. అంతేకాదు.. వంశీకి చట్టాలపై గౌరవం లేదని పేర్కొన్నారు. వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన విజయవాడకు తీసుకెళ్లిన ఏపీ పోలీసులు. రాత్రి ACMM కోర్టులో హాజరుపర్చారు. వంశీతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఏ7 ఎలినేని వెంకట శివరామకృష్ణ, ఏ8 నిమ్మ లక్ష్మీపతిలకు కూడా కోర్టులో హాజరుపర్చారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట 45 నిమిషాల వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో అదనంగా మరో అరగంటపాటు వాదనలు విన్నారు జడ్జి. ఆ తర్వాత వంశీతో పాటు శివరామకృష్ణ, నిమ్మ లక్ష్మీపతిలకు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు.. ఆయనదే కీలక పాత్ర..!
అయితే, వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. సత్యవర్ధన్‌ను బెదిరించడంలో వంశీదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని గుర్తించినట్లు ప్రస్తావించారు. వంశీకి చట్టాలపై గౌరవం లేదని, అతనికి నేర చరిత్ర ఉందని, ఇప్పటి వరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. వంశీని పట్టుకునేందుకు ఎన్టీఆర్ జిల్లా సీపీ ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడ తీసుకొచ్చామని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఈ కేసులో ఏ9గా ఉన్న పొట్టి రాము తనను కలవాలని వంశీ బలవంతం చేశారని, సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించారని అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపు, దాడి కేసులో వంశీతో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు పోలీసులు. ఏ1గా ఉన్న వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేస్తే, ఏ7 ఎలినేని శివరామకృష్ణ, ఏ8 నిమ్మ లక్ష్మీపతిని విజయవాడలో అరెస్టు చేశారు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో సత్యవర్దన్ వాగ్మూలం నమోదు చేశారు. వంశీని విజయవాడ.. కృష్ణ లంక పోలీస్‌ష్టేషన్‌లో 8 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. ఇంటరాగేషన్ ముగిశాక వంశీతో పాటు మిగతా నిందితులకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షలు ముగిశాక రాత్రి 10 గంటలకు కోర్టుకు తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. రిమాండ్ విధించడంతో వంశీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినప్పటి నుంచి విజయవాడ సబ్ జైలు వరకు పటిష్టభద్రత మధ్య వంశీని తరలించారు పోలీసులు. సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో మిగతా నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ కేసులో కీలకమైన సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.
నా భర్త అరెస్ట్ అక్రమం.. ప్రాణహాని ఉంది..
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వంశీ భార్య పంకజ శ్రీ.. వంశీ అరెస్ట్ సక్రమంగా జరగలేదన్న ఆమె.. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయనే తెలుస్తోంది.. అరెస్ట్ అక్రమం అనేది కూడా స్పష్టం అవుతోందన్నారు.. ఇక, తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని మెజిస్ట్రేట్‌కి వంశీ తెలిపారని గుర్తుచేశారు.. పోలీస్‌స్టేషన్‌లో వంశీ పట్ల పోలీసులు తప్పుగా ప్రవర్తించారు.. నా భర్త అరెస్ట్‌పై న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ.. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ పడింది. దీంతో వంశీని పటిష్ట భద్రత మధ్య విజయవాడ సబ్ జైలుకు తరలించారు పోలీసులు. వంశీని హైదరాబాద్.. రాయదుర్గంలో నిన్న ఉదయం అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన విజయవాడకు తీసుకెళ్లిన ఏపీ పోలీసులు.. రాత్రి ACMM కోర్టులో హాజరుపర్చారు. వంశీతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఏ7 ఎలినేని వెంకట శివరామకృష్ణ, ఏ8 నిమ్మ లక్ష్మీపతిలకు కూడా కోర్టులో హాజరుపర్చారు. ప్రభుత్వం తరఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట 45 నిమిషాల వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో అదనంగా మరో అరగంటపాటు వాదనలు విన్నారు జడ్జి. ఆ తర్వాత వంశీతో పాటు శివరామకృష్ణ, నిమ్మ లక్ష్మీపతిలకు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
నేడు కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీలు చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్‌లో కులగణన, ఎస్సీ వర్గీకరణలపై కాంగ్రెస్ నేతలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై డిప్యూటీ సీఎం భట్టి.. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క.. ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని పీసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ ఆఫీసు బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు పాల్గొంటారు. ప్రతి జిల్లాలోని సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు అందరూ విధిగా పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కోరారు.
అమెరికాకు ‘‘మాగా’’, ఇండియాకి ‘‘మిగా’’.. రెండు కలిస్తే ‘‘మెగా’’.. దీని అర్థం ఏమిటంటే..
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. వైట్ హౌజ్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల గురించి చర్చించారు. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇదిలా ఉంటే, ట్రంప్‌తో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో, ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్(MIGA)’ అని అన్నారు. ట్రంప్ అమెరికాని ‘‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA)’ మారుస్తానని ప్రకటించారు. ఇదే విధంగా మోడీ కూడా ఇండియాను గొప్పగా మారుస్తానని అన్నారు. రెండు దేశాల ‘మాగా’, ‘మిగా’ కలిస్తే ‘మెగా’ భాగస్వామ్యంగా మారుతుందని ప్రధాని అన్నారు. ‘‘ అమెరికా ప్రజలకు ట్రంప్ నినాదం మాగా-అమెరికాను గొప్పగా చేయండి’ గురించి బాగా తెలుసు, భారత్ ‘‘వికసిత భారత్ 2047’’ లక్ష్యంగా ముందుకు వెళ్తోందని, అమెరికా భాషలో చెప్పాలంటే ‘‘మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్-MIGA’’ అని అన్నారు. రెండు దేశాల లక్ష్యాలు కలిస్తే మెగాగా మారుతుందని చెప్పారు. 2030 నాటికి భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేరాలని ఇరువురు నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాల కోసం ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని మోడీ చెప్పారు. రెండు దేశాలు ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తి మరియు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ దిశలో ముందుకు సాగుతున్నాయని అన్నారు.
అక్రమ వలసదారులకు మోడీ షాక్.. వారికి ఆ హక్కు లేదని ప్రకటన..
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ సమయంలో ఆయన మాట్లాడుతూ.. యూఎస్‌లో అక్రమంగా ఉంటున్న తమ పౌరుల్ని భారత్ తిరిగి స్వీకరింస్తుందని చెప్పారు. అదే సమయంలో మానవ అక్రమ రవాణాని అంతం చేయడానికి ప్రయత్నాలు అవసరమని చెప్పారు. ట్రంప్, మోడీ సంయుక్త మీడియా సమావేశంలో అక్రమ వలసలపై అడిగిన ప్రశ్నకు మోడీ సమాధానం ఇచ్చారు. ఒక దేశంలోకి అక్రమంగా ప్రవేశించే ఎవరికైనా అక్కడ నివసించే హక్కు లేదని ప్రపంచమంతటికీ ఇది వర్తిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఇటీవల, అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని బహిష్కరించడాన్ని ట్రంప్ సర్కార్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే తొలి విడతలో 104 మంది అక్రమంగా యూఎస్‌లో ఉంటున్న భారతీయుల్ని బహిష్కరించింది. వీరిని అమెరికా సైనిక విమానంలో అమృత్‌సర్‌కి తీసుకువచ్చారు. ‘‘భారత్‌లోని చాలా మంది యువకులు, పేద ప్రజలు వలసల బారిన పడి మోసపోతున్నారు. వీరు చాలా సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవారు. పెద్ద కలలు, పెద్ద హామీలకు ఆకర్షితమవుతున్నారు. చాలా మందిని ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియకుండానే తీసుకువస్తున్నారు. చాలా మందిని మానవ అక్రమ రవాణా వ్యవస్థ ద్వారా తీసుకువస్తున్నారు’’ అని మోడీ అన్నారు. మానవ అక్రమ రవాణా ఎకో సిస్టమ్‌ని అంతం చేయడానికి భారత్, అమెరికా సంయుక్తంగా పనిచేయాలని అన్నారు. మా అతిపెద్ద పోరాటం ఈ ఎకోసిస్టమ్ మీదనే అని, అధ్యక్షుడు ట్రంప్ దీనికి సహకరిస్తారని విశ్వసిస్తాము అని అన్నారు.
భారత్‌కి F-35 స్టెల్త్ ఫైటర్లు.. అమ్మేందుకు అమెరికా సిద్ధం..
ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత, ఆయనను కలిసిన అతికొద్ది మంది ప్రపంచ నాయకుల్లో మోడీ ఒకరు. అమెరికా పర్యటనలో ఉన్న మోడీకి వైట్ హౌజ్‌లో ట్రంప్ ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం, వివిధ రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా భారత్ తమ వాణిజ్య బంధాన్ని మరింత పెంచుకుటామని చెప్పాయి. అంతకుముందు ప్రధాని మోడీ నాకన్నా అత్యంత కఠినమైన సంధానకర్తగా ట్రంప్ అభివర్ణించారు. ఇదిలా ఉంటే, అమెరికా తన అత్యుత్తమ యుద్ధవిమానం F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను భారత్‌కి అమ్మేందుకు ముందుకు వచ్చింది. “ఈ సంవత్సరం నుండి, మేము భారతదేశానికి సైనిక అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతాము” అని ట్రంప్ అన్నారు. ‘‘చివరకు మేము భారతదేశానికి F-35 స్టీల్త్ ఫైటర్లను అందించడానికి కూడా మేము మార్గం సుగమం చేస్తున్నాము’’ అని ట్రంప్ చెప్పారు.
‘‘మిమ్మల్ని చాలా మిస్సయ్యాం’’..మోడీకి ట్రంప్ ఆత్మీయ ఆలింగనం..
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లారు. వైట్ హౌజ్‌లో ప్రధాని మోడీకి ట్రంప్ ఘనంగా స్వాగతం పలికారు. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్‌లోని వెస్ట్ వింగ్ లాబీలో ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతం పలికారు. ఇద్దరు నాయకులు ఒకరినొకరు పలకరించుకుంటూ, హృదయపూర్వకంగా కౌగిలించుకున్నారు. ‘‘మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం’’ అని ట్రంప్ మోడీతో అన్నారు. ట్రంప్‌ని మళ్లీ చూడటంపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎక్స్‌లో మోడీ, ట్రంప్ ఫోటోలను షేర్ చేశారు. ప్రధాని మోదీ వచ్చిన వెంటనే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాతో సహా భారత ప్రతినిధి బృందం వైట్‌హౌస్‌కి వెళ్లింది. ప్రధాని మోడీ రాకకు ముందు వైట్ హౌజ్ వద్ద భారత జెండాలను ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత, ఆయనను కలిసిన ప్రపంచ నాయకుల్లో నాలుగో వ్యక్తి మోడీ.
మూడేళ్ల ముందు అమ్ముడే పోలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కెప్టెన్‌గా రజత్ పటీదార్ ఎంపికైన విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు నడిపించిన ఆర్సీబీకి.. పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని రజత్ సారథిగా నియమితుడు కావడం అందిరినీ ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతేకాదు మూడేళ్ల ముందు ఐపీఎల్‌లో అమ్ముడే కాని ఈ 31 ఏళ్ల ఆటగాడు.. ఆర్సీబీకి సారథి కావడం విశేషమే. అయితే ఈ అనూహ్య ఎదుగుదలకు కారణం రజత్ ఆటలో వచ్చిన అనూహ్య మార్పే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2021లో రజత్ పటీదార్‌కు ఐపీఎల్ ఆడే అవకాశం వచ్చింది. రూ.20 లక్షలకు ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. 2021లో 4 మ్యాచ్‌లలో 71 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తర్వాతి సీజన్‌కు అతడిని అట్టిపెట్టుకోలేదు. 2022 వేలంలో రజత్‌ను ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 2022 సీజన్ ముందు లవ్‌నీత్ సిసోడియా గాయపడడంతో.. అతడి స్థానంలో రూ.20 లక్షలకే రజత్‌ను ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది. ఆ సీజన్లో మెరుపులు మెరిపించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై 54 బంతుల్లోనే 112 పరుగులు బాదాడు. గాయం వల్ల 2023 సీజన్‌కు అతడు దూరమయ్యాడు.
ఆ సినిమా నుండి విశ్వక్ సేన్ ఔట్
మాస్ కా దాస్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం తొలిసారి లేడీ గెటప్ వేసాడు విశ్వక్ సేన్. ఈ సంగతి అలా ఉంచితే రాబోయే ఓ సినిమాలో విశ్వక్ సేన్ నటించడం లేదు అనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్ సూపర్ హిట్ అయింది. ఇక హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో భాగంగా నాని హీరోగా హిట్ : ది థర్డ్ కేస్ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన నాని అర్జున్ సర్కార్ లుక్ అదిరిపోయింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో ఓ మాస్ హీరో ఎంట్రీ ఉంటుందని అది బాలయ్య అని కూడా టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే హిట్ 3లో మాత్రం నానితో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కనిపిస్తారని తెలుస్తోంది. వాళ్లేవరో కాదు హిట్ ఫస్ట్ కేస్ హీరో విశ్వక్ సేన్, హిట్ సెకండ్ కేస్ హీరో అడివి శేష్ కామియో రోల్‌లో కనిపించనున్నారట. కథలో భాగంగానే ఈ ఇద్దరు నానికి సపోర్ట్‌గా ఇన్విస్టిగేషన్‌కు హెల్ప్ చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం. కానీ అందుతన్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి విశ్వక్ సేన్ తప్పుకున్నారట.హిట్ ఫస్ట్ కేస్ లోని కొంత ఫుటేజ్ తో మ్యానేజ్ చేస్తారట. మొత్తనికి హిట్ సినిమా ఫ్రాంచైజ్ నుండి విశ్వక్ సేన్ తప్పుకున్నాడు.
ఎన్టీఆర్ హైట్ గురించి నిజంగా ఆ డైరెక్టర్ అంత మాట అన్నాడా.. ?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత హీరో హీరోయిన్లకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఎప్పటివో వీడియోలు ఫోటోలను తీసుకొచ్చి మళ్లీ ట్రెండ్ చేస్తుంటారు. సోషల్ మీడియా గాసిప్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తాయో చెప్పడం కష్టమే. నిజం, అబద్దం మధ్య ఉన్న చిన్న గీత చాలా సార్లు కనిపించకుండా పోతుంది. తాజాగా టాలీవుడ్ దర్శకుడు రవిబాబు చాలా పాత ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్నాయి. యాంటీ ఫ్యాన్స్ రవిబాబు మాటలను కట్ చేసి, ఎన్టీఆర్ హైట్ పై వ్యాఖ్యలు చేసినట్లుగా చూపిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే నిజం వేరే కోణంలో ఉందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రూఫ్ చేశారు. ఇంటర్వ్యూలో రవిబాబు మాట్లాడుతూ, “అతనికి తెలుగు రాదు.. ఎక్కడి నుంచో రావాలి.. నా భుజం వరకే ఉంటాడు” అంటూ కామెంట్స్ చేశాడు. యాంటీ ఫ్యాన్స్ ఈ మాటలను కట్ చేసి, సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ సీన్లను కలిపి, రవిబాబు ఎన్టీఆర్ హైట్ గురించి కామెంట్ చేశాడంటూ ప్రచారం చేశారు. ఈ ఎడిటెడ్ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అసలు వీడియోను ఎన్టీఆర్ అభిమానులు బయటకు తీసుకొచ్చారు.