Godavari River: మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానాలకు దిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. తక్షణమే రంగంలోకి దిగి పోలీసులు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ప్రారంభించారు. మహాశివరాత్రి సందర్భంగా నదిలో స్నానానికి వెళ్లిన యువకులు.. లోతు ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో మునిగిపోయినట్టుగా భావిస్తున్నారు. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో స్నానాల రేవు లేదు. గల్లంతయిన యువకులు తాడిపూడి గ్రామానికి చెందిన సుమారు 19 సంవత్సరాలు వయసు ఉన్న తిరుమల శెట్టి పవన్.. పడాల దుర్గాప్రసాద్.. అనీసెట్టి పవన్.. గర్రె ఆకాష్.. పడాల సాయిగా గుర్తించారు పోలీసులు.. తెల్లవారుజామున నదిలో స్నానానికి వెళ్లిన యువకులు.. నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించక మునిగిపోయారని.. ఒకరికి ఒకరు రక్షించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఐదుగురు యువకులు గల్లంతు అయినట్టుగా ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు..
Read Also: Sandeep Reddy Vanga: నా కారణంగా అతని అడిషన్స్ నుండి పంపించేశారు: సందీప్ రెడ్డి వంగ