Vallabhaneni Vamsi Cases: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మె్ల్యే వల్లభనేని వంశీ మోహన్ చుట్టూ కేసులు ఉచ్చు బిగుస్తోంది.. ఇప్పటికే వల్లభనేని వంశీని పోలీసు కస్టడీకి అనుమతించింది కోర్టు.. మంగళవారం ఆయన్ని ప్రశ్నించిన పోలీసులు.. ఈ రోజు, రేపు కూడా విచారించనున్నారు.. అయితే, ఈ సమయంలో వల్లభనేనిపై మరో ఫిర్యాదు అందింది.. కోనాయి చెరువు రిజర్వాయర్ కు అదనంగా మరో రిజర్వాయర్ నిర్మాణం పేరిట మట్టి తవ్వకాలు చేపట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.. తొండెం గట్టు చెరువులో మట్టి తవ్వకాలు చేసి కోట్లు కొల్లగొట్టినట్టు వంశీ, ఆయన అనుచరులపై గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు మురళీ అనే వ్యక్తి.. దీంతో, వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు..
Read Also: Maha Shivaratri 2025: శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. భక్తజనసంద్రంగా కోటప్పకొండ..
కాగా, సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని తొలి రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు పలు అంశాలపై లోతుగా విచారణ జరిపారు. తొలిరోజు కస్టడీలో మూడున్నర గంటలపాటు విచారణ జరిగింది. ముగ్గురు ఏపీసీలు ప్రశ్నల వర్షం కురిపించారు. వంశీని 20కుపైగా ప్రశ్నలు అడిగారు అధికారులు. కీలకమైన ప్రశ్నలకు… తెలియదని సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో కొన్ని ఆధారాలను వంశీ ముందు ఉంచారు పోలీసులు. తనకు, ఈ కేసుకు ఏ సంబంధం లేదని.. తాను కిడ్నాప్ చేయలేదని వంశీ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక… కేసులో కీలకంగా మారిన ఫోన్ గురించి ప్రశ్నించగా… ఎక్కడ పెట్టానో గుర్తులేదని చెప్పారు వల్లభనేని వంశీ. తాను మూడు ఫోన్లు వాడుతున్నట్టు పోలీసులకు చెప్పాడు. ఆ మూడు ఫోన్ నంబర్లను వంశీ నుంచి సేకరించారు పోలీసులు. అయితే.. సత్యవర్ధన్‌ను లిఫ్ట్‌లో హైదరాబాద్ ఇంటికి తీసుకెళ్లినట్టు అంగీకరించిన వంశీ… అతను సత్యవర్ధన్ అని తనకు తెలీదని చెప్పినట్టు సమాచారం. వంశీతో పాటు మరో ముగ్గురిని పోలీసులు విచారించారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో ముగ్గురు నిందితులను ఒకే స్టేషన్‌లో వేర్వేరు చోట్ల ప్రశ్నించారు.
Read Also: YS Jagan: పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్.. మధ్యాహ్నం బెంగళూరుకు మాజీ సీఎం..
మరోవైపు.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అక్రమాలు, ఫిర్యాదులపై వరుస కేసులు నమోదు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రత్యేకంగా వంశీ అక్రమాలను విచారించటానికి ఐపీఎస్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి.. అన్ని వైపుల నుంచి అష్టదిగ్భందనం చేయటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.