AP Inter Exams: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ఈరోజు (మార్చ్ 1) ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే, ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఇక, తొలి రోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ద్వితీయ భాషపై పరీక్ష జరగనుంది. కాగా, ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యార్థులకు ఒక రోజు తప్పించి మరో రోజు పరీక్షలు జరగనున్నాయి.
Read Also: Trump Zelensky: ట్రంప్, జెలెన్ స్కీ మధ్య వాగ్వాదం.. వైట్‌హౌజ్ సమావేశంలో రచ్చ..
అయితే, రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది స్టూడెంట్స్ పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారుల ఆఫీసులకు అటాచ్ చేశారు. ఎగ్జామ్ సెంటర్స్ ను నో మొబైల్ జోన్‌గా ప్రకటించారు. అలాగే, పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఇక, అధికారిక సమాచారం కోసం చీఫ్ సూపరింటెండెంట్‌కు మాత్రమే ఇంటర్ బోర్డు ఒక కీప్యాడ్ ఫోన్‌ను అలర్ట్ చేసింది. ఈ పరీక్షలకు నిమిషం నిబంధనను సైతం అమలు చేస్తున్నారు. అంటే.. పరీక్షలకు హాజరయ్యేవారు ఒక్క నిమిషం అలస్యంగా వచ్చిన లోపలికి అనుమతించరు. దీంతో పాటు ఎగ్జామ్స్ సెంటర్స్ దగ్గర పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.