CM Chandrababu: తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి… అయితే, గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తామని చెప్పామంటూ కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవాల్లో సీఎం చంద్రబాబుతోపాటు కూటమి నేతలు పాల్గొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలోని నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా… జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నాకు ఆంధ్ర, తెలంగాణ రెండు సమానమే… సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే వాడుకుంటున్నాం అని స్పష్టం చేశారు.. కాళేశ్వరనికి అభ్యంతరం చెప్పలేదు. 1000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతున్నాయి.. రాజమండ్రి దాటితే నీళ్లు సముద్రంలోకి పోతాయి అన్నారు.. ఇక, పక్క రాష్ట్రాల్లో నీటి వలన విజయవాడలో వరదలు వచ్చాయన్న ఆయన.. అప్పుడప్పుడు మన అభిప్రాయాలను కూడా చెప్పాలి. లేకపోతే.. వారు చెప్పేదే కరెక్ట్ అవుతుందన్నారు.. ఎక్కడున్నా తెలుగు జాతి… తెలుగు జాతే అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..