Posani Krishna Murali: ఏంటి రాజా ఇది..? ఇది పోసాని కృష్ణమురళి ల్యాండ్ మార్క్ డైలాగే కావొచ్చు.. కానీ, ఇప్పుడు.. ఏపీ పోలీసులు కూడా ఏంటి రాజా ఇది..? అనే విధంగా పోసాని కృష్ణమురళిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. రోజుకు ఒక జైలు అన్నట్టుగా పోసాని పరిస్థితి తయారైంది.. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసాని ఇప్పటికే గుంటూరు జైల్లో ఉండగా.. మరో కేసులో ఇప్పుడు పోసాని అరెస్ట్ చేశారు కర్నూలు జిల్లాలోని ఆదోని త్రీ టౌన్ పోలీసులు.. పోసాని మురళి కృష్ణను గుంటూరు నుంచి కర్నూలుకు తీసుకెళ్తున్నారు పోలీసులు.. మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరులో బయల్దేరారు ఆదోని పోలీసులు.. అయితే, ఆదోనిలో మేజిస్ట్రేట్ సెలవు కారణంగా కర్నూలు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు పోలీసులు.. ఆదోని త్రీ టౌన్ లో పోసానికృష్ణ మురళిపై గతంలో కేసు నమోదైంది.. 14.11.24 ఆదోని త్రీటౌన్ లో (క్రైమ్ నెంబర్ 119/24 కేసు నమోదు చేశారు.. జనసేన అధ్యక్షుడు రేణువర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టారు.. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ను దూషించారన్న ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయ్యింది.. మొత్తంగా.. పోసానిని వరుస కేసులు వెంటాడుతున్నాయి..
Read Also: MLC Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు
పోసాని కృష్ణ మురళిని అదుపులోకి తీసుకున్న ఆదోని త్రీ టౌన్ పోలీసులు.. పీటీ వారెంట్ పై తీసుకెళ్తున్నారు.. నిన్న నర్సరావుపేట కోర్టులో పోసానిని హాజరుపరిచారు పోలీసులు.. రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.. ఇక, ఈ రోజు పీటీ వారెంట్ పై ఆదోనికి తీసుకెళ్తున్నారు పోలీసులు.. మొదట రాజంపేట సబ్ జైలు.. ఆ తర్వాత గుంటూరు జైలుకు.. ఇప్పుడు అక్కడి నుంచి కర్నూలు.. ఇలా ఏపీని మొత్తం పోసాని కృష్ణమురళి చుట్టేలా ఉన్నారేమో..