SIPB Meeting: ఎస్ఐపీబీ సమావేశం.. రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం
- రాష్ట్రంలో పెట్టుబడులు, వివిధ సంస్థల ప్రతిపాదనలపై చర్చ
- 10 సంస్థలకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయం (SIPB) తీసుకుంది. ముందుగా 26 జిల్లాల్లో పైలట్ ప్రాతిపదికన వీటిని ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీలో సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశమై మొత్తం 10 సంస్థలకు చెందిన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 1,21,659 కోట్లు పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిన 10 ప్రాజెక్టుల ద్వారా 80,104 మందికి ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేసింది. అలాగే వివిధ సంస్థల పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిపై ట్రాకింగ్ చేయాలని ఎస్ఐపీబీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతకుముందు 26 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన వీటి ఏర్పాటు చేసేందుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.
Fish bite: చేప కాటు వల్ల ప్రాణాంతక ఇన్ఫెక్షన్.. చేయిని కోల్పోయిన రైతు..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదించిన 10 కొత్త ప్రాజెక్టుల ద్వారా 80,104 మందికి ఉద్యోగాలు రానున్నాయి. పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన, ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిపై నిత్యం పరిశీలించాలని దీని కోసం ట్రాకర్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెల రోజుల్లోగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో ఐదు సెంటర్లు నెలకొల్పాలని చెప్పారు. పెట్టుబడులు గ్రౌండ్ అయ్యే వరకు ఆయా సంస్థలతో సంప్రదింపులు చేయాలన్నారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు.. క్షేత్ర స్థాయిలో ఆయా ప్రాజెక్టులు పనులు మొదలుపెట్టేలా చూడాలని తెలిపారు. ఈ విషయంలో అటు మంత్రులు, ఇటు అధికారులు మరింత వేగంగా పనిచేయాలని సీఎం సూచించారు. అప్పుడే ప్రతి ఏడాది ప్రగతి, ఫలితం కనిపిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Aamir Khan: ఆమిర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ “మహాభారత్”.. పనులు షురూ!
ఎస్ఐపీబీ ఆమోదించిన సంస్థల్లో నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ రూ. 1742 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా 2 వేల మందికి ఉపాధి కలుగనుంది. దాల్మియా సిమెంట్ : కడప జిల్లా – రూ.2,883 కోట్ల పెట్టుబడులు, 354 ఉద్యోగాలు కల్పించనుంది. లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్ : విశాఖపట్నం – రూ. 1,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ : శ్రీసిటీ – రూ. 25,000 కోట్ల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ : రూ.58,469 కోట్ల పెట్టుబడులు, 13,050 ఉద్యోగాలు రానున్నాయి. బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ : రూ.1,175 కోట్లు, 1,500 ఉద్యోగాలు కలుగనున్నాయి. ఏపీ ఎన్జీఈఎల్ హరిత్ అమ్రిత్ లిమిటెడ్ : అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు – రూ.22,000 కోట్ల పెట్టుబడులు, 8,300 ఉద్యోగాలు లభించనున్నాయి. ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ : అన్నమయ్య, కడప జిల్లాలు – రూ.8,240 కోట్లు, 4,000 ఉద్యోగాలు రానున్నాయి. మేఫెయిర్ బీచ్ రిసార్ట్స్, కన్వెన్షన్ : రూ. 400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఒబేరేయ్ విలాస్ రిసార్ట్ : రూ. 250 కోట్ల పెట్టుబడులతో 150 ఉద్యోగాలు కల్పించనుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!