ఆంధ్రప్రదేశ్‌లో ఉమెన్ సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇప్పటి వరకు ఉండేది.. ఇప్పుడు ఐజీ నేతృత్వంలో ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా 164 శక్తి టీమ్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కాల్స్ వచ్చినపుడు రెస్పెన్స్ టైం వీలైనంత వేగంగా ఉండేలా చూస్తున్నామని తెలిపారు. మరోవైపు.. శక్తి యాప్ కూడా అందుబాటులో ఉందని డీజీపీ హరీష్ కుమార్ చెప్పారు. మిస్సింగ్ చైల్డ్ గురించి కూడా ఈ యాప్ ద్వారా పోలీసులకు తెలియజేయవచ్చని అన్నారు. సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతున్నాయి.. సైబర్ క్రైమ్స్ పరివేక్షణకు అధికారులతో ఒక వింగ్ ఏర్పాటు చేస్తున్నామని ఏపీ డీజీపీ తెలిపారు.
Read Also: Holi 2025: హోలీకి , రాధాకృష్ణులకు సంబంధం ఏంటి?
టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. మరోవైపు.. 11 వేల ఎకరాల్లో గంజాయి సాగు నిర్వీర్యం చేశాం.. డ్రోన్ సాయంతో ఈ వివరాలు సేకరించామన్నారు. డ్రగ్స్ అమ్మే వారి ఆస్తులను సీజ్ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. ఏపీలో శాంతి భద్రతల సమస్యకు కారణమైన వారు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సైబర్ నేరాల నుంచి అప్రమత్తంగా ఉండండి.. సైబర్ క్రైమ్స్ చేస్తున్న వారిపై ఇకపై పీడీ యాక్ట్ పెడతామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు.
Read Also: Sambhal holi celebration: 46 ఏళ్ల తర్వాత సంభాల్‌లో హోలీ వేడుకలు.. భారీగా భద్రత..