Venkaiah Naidu: తెలుగులో తిట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషని మరిచిపోయినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు.. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో భారత జ్యోతి పురస్కార ప్రదాన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. వెంకయ్య నాయుడు…
ఏపీలో కొత్తగా 6 విమానాశ్రయాలు..! భోగాపురం ఎయిర్పోర్టు గడువు కంటే ముందే పూర్తి చేయబోతున్నాం… ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 6 విమానాశ్రయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రహదారుల పరిస్థితి దారుణంగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీసీ జనార్ధన్ రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో రోడ్ల సంరక్షణ, మరమ్మతులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం ప్రభుత్వం భారీ ఆర్థిక భారం మోస్తోందని ఆయన…
CM Chandrababu: అమరావతి రాజధాని వెంకటాపాలెంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి పేరు పెట్టాలని వెంకటేశ్వర స్వామి సంకల్పం ఇచ్చాడు.. శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తుని గానే ఉంటాను అన్నారు.
Tirumala laddu controversy: తిరుమల లడ్డూ వివాదంలో ప్రస్తుత ప్రభుత్వం నా మీద విష ప్రచారం చేస్తోంది అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందని సుప్రీం కోర్టులో నేను పిటీషన్ దాఖలు చేశాను.. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పరిస్థితులు ఉన్నాయి.
Cyber Crime: పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు దోచుకున్న గ్యాంగ్ను భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యుల ఈ ముఠా, ఆధునిక సైబర్ ట్రిక్స్తో ప్రజలను మోసగిస్తూ భారీ మొత్తంలో డబ్బును దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
CM Chandrababu: ఇవాళ అమరావతి రాజధాని ప్రాంతంలో వెంకటాపాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ చేయనున్నారు.
గూగుల్ బాటలో రిలయన్స్.. ఏపీలో మరో భారీ పెట్టుబడి.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం హయాంలో వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి.. ఇప్పటికే గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఒక లక్ష 34 వేల కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ను నెలకొల్పుతున్న సంగతి విషయం విదితమే కాగా.. ఈ విదేశీ సంస్థ బాటలో మన స్వదేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ కూడా విశాఖలోనే రూ.98,000 కోట్లతో 1 గిగా వాట్ సామర్థ్యం కలిగిన అతిపెద్ద హైపర్ స్కేల్…
శ్రీవారి భక్తులకు డబుల్ బొనాంజా..! శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించునుంది టీటీడీ. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. సాధారణంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన దర్శన టోకెన్లను ఆన్లైన్ విధానంలో జారీ చేస్తుంది టీటీడీ.. సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి దర్శన టోకెన్లు ఆఫ్లైన్ విధానంలో జారీ…
YS Jagan Pulivendula tour: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల పర్యటన రెండవ రోజు బిజీబిజీగా సాగింది.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యకర్తలను కలవటం… పరామర్శించటం.. భరోసా ఇవ్వటం.. అండగా ఉంటామని చెబుతూ పూర్తి చేశారు.. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా పలువురు పార్టీ నేతలకు సంబంధించిన వివాహ వేడుకలకు హాజరైన జగన్ వధూవరులను ఆశీర్వదించారు.. మార్గం మధ్యలో ప్రజలను కలుస్తూ సమస్యలను తెలుసుకుని…