* నేడు వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి సీఎం చంద్రబాబు.. ఉదయం 10.30 గంటలకు వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన.. రెండు దశల్లో రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు..
* నేడు పులివెందుల నుంచి బెంగుళూరుకు వెళ్లనున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి హెలికాఫ్టర్ లో బెంగుళూరుకు వెళ్లనున్న జగన్.. రెండు రోజులు సొంత నియోజకవర్గంలో పర్యటించిన జగన్..
* నేడు వైపీసీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ.. పార్లమెంట్ శీతాకాలం సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి కావాలని మిథున్ రెడ్డి పిటిషన్..
* నేడు రాజమండ్రిలో రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో బీజేపీ గోదావరి జోన్ ప్రశిక్షణ కార్యక్రమం.. హాజరుకానున్న ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు..
* నేడు విశాఖ స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అడ్మిన్ బిల్డింగ్ ఎదుట ధర్నా.. ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లింపు సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్..
* నేటి నుంచి తిరుమలలో ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ప్రక్రియ ప్రారంభం.. డిసెంబర్ 1వ తేదీ వరకు భక్తులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం.. టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాప్ ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం..
* నేటి నుంచి మూడు రోజుల పాటు కస్టడీకి ఐబొమ్మ రవి.. చంచల్ గూడ జైలు నుంచి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్న పోలీసులు..
* నేడు కామారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాట.. జనం బాటలో భాగంగా.. నిజాం సాగర్ లో నిర్మిస్తున్న నాగ మడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సందర్శించనున్న జాగృతి అధ్యక్షురాలు కవిత.. జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో తొలి రోజు పర్యటించనున్న కవిత..
* నేటి నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ.. నామినేషన్స్ కు చివరి తేదీ నవంబర్ 29..