Venkaiah Naidu: తెలుగులో తిట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషని మరిచిపోయినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు.. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో భారత జ్యోతి పురస్కార ప్రదాన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సమాజ పరిశీలనా శోధకుడు, శోధన సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు భారత జ్యోతి పురస్కారం అందుకున్నారు.
Read Also: Supreme Court: పౌరసత్వానికి “ఆధార్” రుజువు కాదు..
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. పిడికె రావు సేవలను విని, ఆయన్ని కలవాలని, అవార్డు ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను అన్నారు.. తెనాలి ప్రాంతానికి ఎంతో అభిమానం, ఇక్కడి నుంచి ఎన్నో పోరాటాలు చేశాం. సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడడం యువత బాధ్యత.. యువత గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.. ఇక్కడ కలిసిన దృష్టి అవార్డు ఇవ్వటం మాత్రమే కాదు, మానవత్వపు విలువలు కాపాడుకోవడం కూడా అన్నారు.. ఇక, అమ్మ భాషను మరచినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు.. ఇక, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలుగు పరిపాలన చేపట్టమని సూచించాను.
ఇక, పిడికె రావు మనసు నిండా పేదవాడిపై ప్రేమ కలిగి ఉన్నాడు. అమెరికాలో వేల డాలర్లు సంపాదించి వాటన్నింటిని వదిలేసి, పేద ప్రజలకు విజ్ఞానాన్ని అందిస్తున్న అసాధారణ నిర్ణయం కామేశ్వరరావు ది అన్నారు వెంకయ్యనాయుడు.. మరోవైపు, ఉచిత పథకాలపై హాట్ కామెంట్స్ చేశారు వెంకయ్య.. ఉచితాలు ఇచ్చినప్పుడు, మనుషులు సోమరిపోతులుగా తయారవుతారు… ఉచిత విద్య, ఉపకరణాలు పేదవారికి మాత్రమే అందించాలి.. కానీ, చేపలు ఉచితంగా ఇవ్వకూడదు, చేపలు పట్టడం నేర్పించాలి అని సూచించారు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉచితాల ఆర్థిక భారాన్ని గమనించి, ఆలోచించాలని సూచించారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు..