యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభూ’. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. ఒక యోధుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఆయన తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. కేవలం ఫిజిక్ మాత్రమే కాకుండా, యుద్ధ సన్నివేశాల్లో సహజత్వం కోసం విదేశాల్లో కత్తిసాము, గుర్రపు స్వారీ మరియు ఆర్చరీలో (విలువిద్య) ప్రత్యేక శిక్షణ పొందారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజువల్స్ హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయని సమాచారం. అయితే తాజాగా
Also Read : Mana Shankara Varaprasad: ‘మన శంకర వరప్రసాద్’ గ్రాండ్ సెలబ్రేషన్స్ కి టైమ్ టూ డేట్ ఫిక్స్..
ఈ సినిమా విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది వేసవి కానుకగా, ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ పాన్-ఇండియా చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సినిమాపై అంచనాలను మరో మెట్టు ఎక్కించింది. ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చారిత్రక గాథ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.