Satavahana College Controversy: శాతవాహన కళాశాల వివాదం.. రూ.200 కోట్ల విలువైన ఆస్తిని కాపాడండి..!
- శాతవాహన కళాశాలను వీడని వివాదాలు..
- వారం క్రితం కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్..
- తాజాగా, కాలేజీ భవనాల కూల్చివేత, ఆందోళనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satavahana College Controversy: విజయవాడ శాతవాహన కళాశాలను వివాదాలు వీడడం లేదు. వారం క్రితం కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్‌తో… ఒక్క సారిగా కలకలం రేగింది. తాజాగా, కాలేజీ భవనాల కూల్చివేత ఆందోళనకు దారితీసింది. ఇరు పక్షాలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. కాలేజీ భూముల విషయంలో బోయపాటి శ్రీనివాస్, వంకాయలపాటి మధ్య సుప్రీం కోర్టులో వివాదం నడుస్తుంది. ఈ నెల 3న కోర్టు ఆదేశాల ఇచ్చిందని బోయపాటి కుటుంబానికి చెందిన శ్రీకృష్ణ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు తమ భూమి స్వాధీనం చేసుకున్నామన్నారు శ్రీకృష్ణ. కాలేజీ రికార్డులు అన్నీ సొసైటీ వాళ్ల దగ్గరే ఉన్నాయన్నారు. ఖాళీ చేయించే ముందు అన్ని విషయాలు సొసైటీకి చెప్పామన్నారు బోయపాటి శ్రీకృష్ణ.
Read Also: Double Murder Case: అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్..? డబుల్ మర్డర్ కేసులో పోలీసుల గాలింపు..
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ కూడా కాలేజీ రికార్డులు తమ వద్ద ఉన్నట్టు అంగీకరించారు. అయితే, మాజీ ప్రిన్సిపాల్ సాంబి రెడ్డి మాత్రం కాలేజీ భవనాల కూల్చివేతను తప్పుబట్టారు. విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదన్నారు. మరోవైపు సొసైటీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు TDP MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్. మరోవైపు… శాతవాహన కాలేజీ వ్యవహారంలో సుప్రీం కోర్టులో తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకోలేదన్నారు సొసైటీ వ్యవస్థాపకుల్లో ఒరైన ప్రజాపతి రావు. తన సంతకాన్ని పోర్జరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: Story board: తెలుగు రాష్ట్రాల ఆర్థిక స్థితి ఏంటి? ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ? హామీల సంగతేంటి?
ఇక, శాతవాహన కళాశాల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు.. కీలక వ్యాఖ్యలు చేశారు.. శాతవాహన కళాశాలను రాత్రికి రాత్రి కూల్చేశారు.. ప్రభుత్వ అండతో కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ప్రభుత్వ పెద్దల అండతో ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు.. 200 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు.. ఎమ్మెల్సీ ఆలపాటి పై కిడ్నాప్ ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు.. విద్యార్ధుల భవిష్యత్ అంధకారంలో పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు.. విద్యాశాఖ మంత్రి ఈ అంశంపై స్పందించాలి.. ప్రభుత్వం వెంటనే ఈ వివాదంపై స్పందించాలి.. SRR కళాశాల స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కనకదుర్గ థియేటర్ ను కూడా బుల్డోజర్ తో పగలకొట్టారు.. బుల్డోజర్ సంస్కృతి రాష్ట్రంలో నడుస్తోందని ఫైర్ అయ్యారు సీపీఎం నేత బాబూరావు..
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!