Sugavasi Balasubramanyam Resign for TDP: రాజంపేటలో టీడీపీకి బిగ్ షాక్..!
- రాజంపేటలో టీడీపీకి బిగ్ షాక్..
- పార్టీకి గుడ్ బై చెప్పిన సుగవాసి బాలసుబ్రమణ్యం..
- గత ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి..
- టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugavasi Balasubramanyam Resign for TDP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా.. టీడీపీ, జనసేన, బీజేపీలోకి వలసలు వచ్చారు నేతలు.. ఎంపీ, ఎమ్మెల్సీలు, కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. కూటమి పార్టీలో చేరారు.. అయితే, ఇప్పుడు.. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఇప్పుడు, టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపారు సుగవాసి బాలసుబ్రమణ్యం.. “ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను…” అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలో పేర్కొన్నారు సుగవాసి బాలసుబ్రమణ్యం..
Read Also: Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
మరోవైపు, అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాజంపేట పద్మ ప్రియ కళ్యాణ మండపం లో నియోజక వర్గ టీడీపీ బత్యాల చెంగల రాయుడు వర్గీయుల భేటీ అయ్యారు. టీడీపీ అసెంబ్లీ ఇంఛార్జ్ పదవి చెంగల రాయుడుకు ఇవ్వాలని.. మోకాళ్ళపై నిలబడి కార్యకర్తలు నినాదాలు చేసారు. రాజంపేట తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కోవర్డులు చొరపడ్డారని.. నిజమైన కార్యకర్తలకు పార్టీ నేతలు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, సుగవాసి బాలసుబ్రమణ్యం.. టీడీపీకి గుడ్‌బై చెప్పడం ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!