APRERA: రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ప్రమోటర్స్, డెవలపర్లు.. ఇలా రియల్ ఎస్టేట్ పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.. ప్రీ లాంచ్ పేరుతో కస్టమర్లను తమ బుట్టలో వేసుకుని.. క్యాష్ చేసుకుంటున్నారు.. అయితే, మీరు ప్లాట్ కొంటున్నారా? అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నారా? అయితే, ఇది మీ కోసమే..! ఎందుకంటే ఏపీ రెరాలో రిజిస్టర్ కాని ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు ఆంధ్ర ప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (APRERA) ఛైర్‌పర్సన్ సురేష్ కుమార్..
Read Also: Revanth Reddy: నేను ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదు!
ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా)లో నమోదు చేసుకోకుండా కస్టమర్ల వద్ద డిపాజిట్లు తీసుకోవడం చట్ట విరుద్దమని స్పష్టం చేశారు.. ప్రీ లాంచ్ పేరుతో కొనుగోలుదారుల నుంచి కొంతమంది డెవలపర్లు, ప్రమోటర్లు, బిల్డర్లు డిపాజిట్లు సేకరణ మా దృష్టికి వచ్చింది.. అయితే, రేరా ఆమోదం పొందక ముందే డిపాజిట్లు సేకరిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.. బిల్డర్స్, ప్రమోటర్స్, డెవలపర్లు.. ఎలాంటి ప్రకటనలు, మార్కెటింగ్, బుకింగ్ వంటివి చేయకూడదు.. ప్రాజెక్టులలో జాప్యాలు, నిర్మాణ నాణ్యత సమస్యలపై కొనుగోలుదారులు రేరాను సంప్రదించవచ్చు అన్నారు APRERA ఛైర్‌పర్సన్ సురేష్ కుమార్..