AP Aqua Farmers: ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ లో కొత్త నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… AP PPC అనే కంపెనీ ఏర్పాటు చేసి, ఆక్వా రైతులకు, ఆక్వా కంపెనీలకు కావాల్సిన అన్ని సేవలు అందించనుంది.. అలాగే, ఫీడ్ ధరలో 14 రూపాయలు MRP మీద అందరికీ సమానంగా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. విద్యుత్ టారిఫ్ తగ్గించడం ద్వారా ఆక్వా రైతులకు భారం తగ్గించాలని నిర్ణయించారు.. స్ధానిక మార్కెట్‌ను పెంచడానికి, రొయ్యల వినియోగం పెంచడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకోనుంది.. APPPC కోసం ఒక వెబ్ సైట్ సిద్ధం చేసారు.. దీనిని APP రూపంలో త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది… ఈ అంశాలపై ఏపీ డిప్యుటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మీడియా సమావేశంలో పూర్తి సమాచారం అందించారు.
Read Also: Jyoti Malhotra: ‘గూఢచారి’ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బెయిల్ తిరస్కరణ..
పాలసీ మార్పులపై, కొత్త కంపెనీ ఏర్పాటుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ.. 3 నెలల క్రితం ఆక్వా పరిశ్రమకు సంక్షోభం వచ్చింది.. ఫిషరీస్ డిపార్ట్మెంట్, APSADA కలిసి పలు సమావేశాలు నిర్వహించాయి.. 4 రూపాయలు ఫీడ్ మీద తగ్గించడం, MRPలో 14 రూపాయల వరకూ తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించాం.. త్వరలో సీఎం ద్వారా ఎన్నికల వాగ్దానం ప్రకారం 1.50 విద్యుత్ టారిఫ్ ఉండేలా వర్తింపచేస్తాం.. కామినేని శ్రీనివాసరావు నియోజకవర్గం, నా నియోజకవర్గం లోనే 3 లక్షల ఎకరాలు ఆక్వా సాగు ఉంది.. 600 కోట్ల భారం ఏపీ ఆక్వా పరిశ్రమపై పడింది.. ఈ భారం రైతు ఒక్కడిపైనే మోపడం సరైనది కాదని.. ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది… స్ధానిక వినియోగం ఎలా పెంచాలి అని ఆలోచించి ఏపీ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కంపెనీ (APPPC) ద్వారా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం.. మా రెండు జిల్లాల్లో మూడు లక్షల ఎకరాలు ఆక్వా ఉంది.. ఈపవర్ టారిఫ్ అమలు ద్వారా రైతుల కల సాకారం అవుతుంది.. ఏపీ ఫ్రాన్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీకి నలభై కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాం.. వంద గ్రాముల నుంచి కిలో వరకు ప్యాక్ చేసి స్థానిక మార్కెట్ ను పెంచుతాం అని తెలిపారు.
Read Also: Sandhya Theatre: సంధ్య థియేటర్‌లో పాముల కలకలం?
మటన్ నిజానికి ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. ఈ ష్రింప్ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ప్రచారం చేస్తాం.. లోకల్ మార్కెట్ కు ఐదు శాతం జీఎస్టీ ఉంది.. నిర్మలా సీతారామన్ తో చర్చించి ఆ ఐదు శాతం జీఎస్టీ రద్దు చేయాలని కోరతాం అన్నారు రఘురామకృష్ణం రాజు.. ఇప్పుడు ఎగుమతులకు ఎటువంటి ఇబ్బంది లేదు.. ఉన్న స్టాకు మొత్తం వెళ్లిపోయింది.. రొయ్యల పెంపకం దారులు ఎక్కువ.. తినేవారు తక్కువ ఉన్నారు. స్థానిక మార్కెట్ ను పెంచితే.. ఆక్వా రంగం అభివృద్ధి చెందుతుంది, రైతుకు ఆదాయం పెరుగుతుందని వెల్లడించారు డిప్యుటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు.