పార్టీ ఓడిన తర్వాత నేతల పరిస్థితి ఎలా ఉంటుంది.. ఒకరంతా మౌనంగా వుంటారు.. మరికొందరు తిరగబడతారు.. కానీ, పేర్ని నాని.. ఆయన వేరు. పదవి పోయినా.. పరవశం పోకుండా.. ప్రత్యర్థులను ఢీకొట్టడానికి సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ్టి విశాఖపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు.. షెడ్యూల్ ప్రకారం విశాఖలో నిర్వహిస్తున్న న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్‌లో సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు ఏపీ సీఎం..
వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక.... ఇటు ఇంటికి, అటు పార్టీకి పూర్తిగా దూరమయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. దీంతో దశాబ్దాలుగా ఆయన్ని నమ్ముకుని ఉన్న కేడర్ చెల్లాచెదురవుతోందట. దీంతో టెక్కలి నియోజకవర్గ వైసీపీ కేడర్‌ను నడిపించే బాధ్యతను శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి తలకెత్తుకున్నారట. వైసీపీ దూరం పెట్టాక... అడపదడప మినహా..
Off The Record: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది జనసేన. జిల్లాలోని ఆరు సీట్లలో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించి కంచుకోటగా నిలబడింది. అలాంటి జిల్లాలో పార్టీ అధినేత ఆశించిందొకటి.. ఎమ్మెల్యేలు చేస్తున్నదొకటి అన్నట్టుగా తయారైందట పరిస్థితి. ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన జనసేన నేతలు.. మళ్ళీ అవకాశం వస్తుందో లేదో… భవిష్యత్తు సంగతి మనకెందుకు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామన్నట్టు ఆత్రంగా వ్యవహరిస్తున్నారట.…
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్. ఉందా.. లేదా అన్నట్టుగా... ఉండీ లేనట్టుగా... అలా అలా బండి లాగించేస్తున్న పార్టీ. అసలు ఒంట్లో బలం ఉందా లేదా అన్నదాంతో... సంబంధం లేకుండా సహజంగా వచ్చే డీఎన్ఏ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ని కూడా వేధిస్తున్నాయట. ఐకమత్యం, అందర్నీ కలుపుకునిపోవడం, కలిసి పనిచేయడంలాంటిని కాంగ్రెస్‌లో పెద్దగా కనిపించని లక్షణాలు.
పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ అరాచకాలు ఏంటి? మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేస్తారా? అని మండిపడ్డ ఆయన.. దాడులకు పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోండి అంటూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు..
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ది చాలా కీలక పాత్ర.. పాలసీ మేకింగ్, వాగ్దానాల అమలు విషయంలో పవన్ కల్యాణ్ అన్నిటినీ సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. కూటమిలో జనసేనకు ఎక్కువ బాధ్యత ఉంది.. ప్రజలకోసం కూటమికి జనసేన ఎప్పుడూ సహకరిస్తుందని తెలిపారు జనసేన పీఏసీ చైర్మన్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్..
విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ రోజు విజయవాడ, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం ఎయిర్పోర్ట్) టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..