Modi-Netanyahu: వైరల్‌గా మారిన సారా నెతన్యాహు-మోడీ దుస్తులు.. ప్రత్యేకత ఇదే!
- ఇజ్రాయెల్‌లో కొనసాగుతున్న ప్రధాని మోడీ పర్యటన
- వైరల్‌గా మారిన సారా నెతన్యాహు-మోడీ దుస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మోడీ బుధవారం ఇజ్రాయెల్ వెళ్లారు. టెల్ అవీవ్‌లో మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెతన్యాహు భార్య సారా దుస్తులు-మోడీ పాకెట్ స్క్వేర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సారా నారింజ రంగు (కుంకుమ పువ్వు) దుస్తులు ధరించారు. మోడీ పాకెట్ స్క్వేర్ కూడా అదే కలర్‌లో ఉండడంతో నెతన్యాహు ప్రత్యేకంగా వేలు పెట్టి చూపిస్తూ ఇద్దరి కలర్లు ఒకేలా ఉన్నాయని చూపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Arjun Tendulkar Wedding: జామ్‌నగర్‌లో అర్జున్ టెండూల్కర్ ప్రత్యేక వివాహ వేడుకలు.. వీడియో వైరల్
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
‘‘మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది’’ అని ప్రధాని మోడీతో నెతన్యాహు అన్నారు. మోడీ కూడా అంతే వేగంగా హృదయపూర్వకంగా పలకరించారు. మోడీ సాంప్రదాయ తెల్లటి కుర్తా, పైజామా ధరించి.. స్లీవ్‌లెస్ జాకెట్ ధరించారు. పాకెట్‌లో కాషాయ చతురస్రాన్ని ధరించారు. అలాగే నెతన్యాహు భార్య కూడా అదే రంగులో ఉన్న దుస్తులు ధరించింది. దీన్ని గమనించిన నెతన్యాహు ఇద్దరికి ఒకే పోలికగా ఉన్నాయని చూపించారు. ‘‘ఆమె ఏం వేసుకుందో చూశారా?’’ అని నెతన్యాహు.. ప్రధాని మోడీ పాకెట్ స్క్వేర్ వైపు.. భార్య దుస్తుల వైపు చూపించారు. ప్రధాని మోడీ వెంటనే ఆ విషయాన్ని గ్రహించి.. ‘‘అవును.. కాషాయం’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీతో సారా హృదయపూర్వక సంభాషణ చేశారు. భారతదేశం ‘‘అద్భుతమైన దేశం’’గా అభివర్ణించారు. ఈ సందర్భంగా భారతదేశానికి రావాలనే తన కోరికను ప్రస్తావించారు. నెతన్యాహు వెంటనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. మోడీ స్వయంగా ‘‘అద్భుతమైన నాయకుడు.’’ అని కొనియాడారు.
ఇక ఉమ్మడి విందుకు ముందు కూడా భారత సాంప్రదాయ దుస్తులతో నెతన్యాహు.. మోడీని పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ‘‘దుస్తుల దౌత్యం.. నేను నా స్నేహితుడు ప్రధాని మోడీని సాంప్రదాయ భారతీయ దుస్తులు ధరించి ఆశ్చర్యపరిచాను.’’ అని నెతన్యాహు రాసుకొచ్చారు.
ప్రధాని మోడీకి ఇజ్రాయెల్‌లో అరుదైన గౌరవం దక్కింది. పార్లమెంట్‌లో ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతేకాకుండా మోడీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవమైన స్పీకర్ అఫ్ ది నెస్సెట్ మెడల్ ప్రదానం చేసింది.
Welcome to Israel my dear friend @narendramodi 🇮🇱🙏🇮🇳 pic.twitter.com/AnRtceD9Ci
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) February 25, 2026
हमारे संयुक्त रात्रिभोज से पहले, मैंने अपने मित्र प्रधानमंत्री मोदी को पारंपरिक भारतीय परिधान पहनकर चौंका दिया। 🇮🇱🇮🇳@narendramodi pic.twitter.com/3ElIQeLY97
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) February 25, 2026
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..