Minister Narayana: మున్సిపల్ శాఖపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన మున్సిపల్ శాఖపై సమీక్ష..
- కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- మీడియాకు వెల్లడించిన మంత్రి నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మున్సిపల్ శాఖపై సమీక్ష సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. ఇక, సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. ముఖ్యంగా స్వచ్ఛమైన మంచినీరు.. వేస్ట్ మేనేజ్‌మెంట్, డ్రైనేజ్.. ప్రజలకు ముఖ్యం.. కేంద్రం నుంచి అనేక నిధులు కూడా వస్తున్నాయి.. స్వచ్ఛ భారత్ కు గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వలేదు.. కానీ, ఇప్పుడు అమృత్ స్కీం ముందుకు తీసుకువెళ్లే విధంగా టెండర్లు పిలిచాం.. రాష్ట్రంలో 80 శాతం ఇళ్లకు మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.. సీఎం చంద్రబాబు.. ఆర్ధిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు.. డ్రైనేజ్ వాటర్ ను శుద్ధి చేసి బయటకు పంపించాలి.. దీనికి సంబంధించి కూడా కార్యాచరణ రెడీ అవుతోందన్నారు..
Read Also: Pakeeza : ఏపీ సీఎం, డిప్యూటి సీఎం కాళ్ళు పట్టుకుంటా.. ఆదుకోండి!
Also Read
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
అభివృద్ధి చెందిన దేశాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి.. విశాఖ, గుంటూరులో 1400 టన్నుల చెత్త నుంచి విద్యుత్ వస్తోందని తెలిపారు మంత్రి నారాయణ.. విజయవాడ, రాజమండ్రిలో వేస్ట్ టు ఎనర్జీ విషయంలో త్వరలో టెండర్లు పిలుస్తున్నాం అన్నారు.. టిడ్కో ఇళ్లకు సంబంధించి కూడా చర్చ జరిగింది. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను ఇవ్వలేదు.. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల 140 కోట్ల బ్యాంక్ రుణాలు కట్టి టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తామని వెల్లడించారు.. మరోవైపు, మున్సిపల్ కార్మికుల సమస్యపై సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.. మున్సిపల్ కార్మికుల సమస్యపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేశామన్నారు.. అప్కాస్ పై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చిస్తుందన్నారు మంత్రి నారాయణ..
తాజావార్తలు
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!