తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసులు అక్రమ గంజాయి నిల్వ ఉంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న భార్యాభర్తలు, వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి ఒక వ్యాన్, కారు, రెండు మోటారు సైకిల్లను, రేకుల షెడ్ సీజ్ చేసినట్లు తెలిపారు. గంజాయి కేసుకు సంబంధించిన వివరాలను రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పీ వై. శ్రీకాంత్ వెల్లడించారు. రాజానగరం మండలంలో కొండగుంటూరు కొండాలమ్మ గుడి సమీపంలో ప్రైవేట్ లే అవుట్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ఆదివారం నాడు సాయంత్రం 4గంటలకి అమరావతిలో జరగనుంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు 35 మంది ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు, దర్శకులు, నటులు, నటీమణులు పాల్గొననున్నారు. ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై…
పాకాల(మం) దామలచెరువులో మామిడి రైతులు, వ్యాపారులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5లక్షల హెక్టార్లకు పైగా మామిడి సాగు అవుతుందన్నారు. ఇప్పటికి 22వేల టన్నులు మార్కెటింగ్ జరిగింది.. లక్ష టన్నులకు పైగా మార్కెటింగ్ జరగాల్సి ఉందన్నారు. తోతాపూరి కేజీకి రూ.12 రైతులకు చెల్లించాలి. చివరి మామిడి కాయ వరకు రు.4 సబ్సిడీ కల్పిస్తాం. పరిశ్రమలు రూ.8 తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. Also Read:Trivikram…
Nara Lokesh: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. వైసీపీ ఆరోపణలు నిరూపించాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వైసీపీకి 24 గంటల డెడ్ లైన్ పెట్టారు.
Taneti Vanitha: రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన లేదు ఈ కూటమి ప్రభుత్వానికి అని వైసీపీ మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు.
Tollywood: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 22వ తేదీకి బదులు రేపు సీఎంతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు సాయంత్రం 4గంటలకి అమరావతిలో సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు.
YS Jagan: సీఎం చంద్రబాబుపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతున్నారు అని పేర్కొన్నారు. వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి నేను ప్రకాశం జిల్లాలోని పొదిలికి వెళ్తే.. ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? అని ప్రశ్నించారు.
హైకోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయడం లేదని మండిపడ్డారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నేను తాడిపత్రి వెళ్తే.. భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.. విశాఖలో ప్రధాన మంత్రి పర్యటన ఉందని.. భద్రత కల్పించలేమని ఎస్పీ జగదీష్ వివరణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏడెనిమిది సార్లు నేను తాడిపత్రి పర్యటన వాయిదా వేసుకున్నా.. నాకు తాడిపత్రి లో సొంత ఇళ్లు ఉంది.. నా ఇంటికి నేను వెళ్తానంటుంటే పోలీసులు అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు..