Sachin-Sehwag-Ganguly: సచిన్–సెహ్వాగ్ ప్రాంక్.. టాయిలెట్‌లో ఉన్న గంగూలీ బలి!
- భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో గుర్తుండిపోయే మ్యాచ్‌లు
- ఆటగాళ్ల మధ్య ఎన్నో సరదా సంఘటనలు
- సచిన్–సెహ్వాగ్ ప్రాంక్‌కు గంగూలీ బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Tendulkar and Virender Sehwag Prank on Sourav Ganguly: భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో గుర్తుండిపోయే మ్యాచ్‌లు మాత్రమే కాకుండా.. ఆటగాళ్ల మధ్య జరిగిన సరదా సంఘటనలు కూడా అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తుంటాయి. అలాంటి ఓ ఆసక్తికరమైన ప్రాంక్ స్టోరీని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా వెల్లడించాడు. ఈ సరదా ఘటనలో వీరూతో పాటు లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బకరా చేశారు.
వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ… ‘నేను, సచిన్ టెండూల్కర్ అప్పట్లో అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నాం. ఒకసారి ఇద్దరం కలిసి సరదాగా సౌరవ్ గంగూలీని ఆటపట్టించాలని ప్లాన్ చేశాం. నేను-సచిన్ కావాలనే టాయిలెట్‌కు వెళ్లాం. దాదా కూడా వచ్చాడు. గంగూలీ టాయిలెట్‌లో ఉన్నప్పుడు మేము బయట నిలబడి.. జర్మనీ నుంచి వచ్చిన కొత్త టీషర్ట్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయని ఉద్దేశపూర్వకంగా మాట్లాడాం. ఇక అక్కడికి నుంచి బయటికి వచ్చాం. ఆ మాటలు వినగానే దాదా నిజంగానే టీషర్ట్స్ వచ్చాయని నమ్మేశాడు’ అని చెప్పాడు.
Also Read
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
- Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
‘టాయిలెట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సౌరవ్ గంగూలీ నేరుగా అడిడాస్ అధికారులకు కాల్ చేశాడు. సచిన్, సెహ్వాగ్‌కు ఇచ్చిన జర్మనీ టీషర్ట్స్ నాకు కూడా పంపండని కోరాడు. దీంతో ఆశ్చర్యపోయిన కంపెనీ ప్రతినిధులు నాకు, సచిన్‌కు కాల్ చేశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. చివరికి ఇది సరదా ప్రాంక్ అని తెలిసి గంగూలీ నవ్వుకున్నాడు’ అని వీరేంద్ర సెహ్వాగ్ వివరించాడు. అప్పట్లో క్రికెట్ లెజెండ్స్ మధ్య ఉన్న స్నేహబంధం, సరదా సంఘటనలు అభిమానులను ఆకట్టుకుంటోంది. మ్యాచ్‌లలో సీరియస్‌గా కనిపించే ఈ దిగ్గజాలు.. ఆఫ్ ఫీల్డ్‌లో ఎంత సరదాగా ఉంటారో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!